♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
♣అభ్యర్థులారా … నంద్యాల సమస్యలు ఇవి… ఏం చేస్తారో మరి
♣శిల్పా రవి, ఫరూక్ దృష్టికి జనాస్త్రం ప్రజల అజెండా ఇది
మేము చెప్పిన పనులు చేసుకొండి … ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ముద్ర వేసుకొండి అంటున్నారు నంద్యాల పట్టణంలోని ఓటర్లు. ప్రస్తుతం వైయస్ఆర్సిపి, తెలుగుదేశం అభ్యర్థులుగా నంద్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్న మాజీ మంత్రి ఫరూక్, ప్రస్తుత ఎమ్మెల్యే రవిచంద్రకిషోర్ రెడ్డిలకు జనాస్త్రం తరఫున ఓటర్లు పలు హామీలు కావాలని కోరుతున్నారు. గత వారం రోజుల నుంచి జనాస్త్రం శ్రేయోభిలాషులు నంద్యాల ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని అభ్యర్థుల దృష్టికి తెస్తున్న అంశాలు ఇవి :-
1.పెద్ద కొట్టాల రోడ్డు నుంచి కెసి కెనాల్ బ్రిడ్జి మీదుగా పొన్నాపురం నుంచి ఎన్జిఓ కాలనీకి రోడ్డు. అలాగే కెసి కెనాల్ కట్టల మీద రెండు వైపుల తార రోడ్డులు వేసి దక్షిణ గోడలు నిర్మించాలి.
2.విజయ డైరీ, పొన్నాపురం, గాంధీనగర్ ప్రాంతాలలోని రైల్వే గేట్ల కింద బ్రిడ్జిలు ఏర్పాటు చేసి వాహానాల రాకపోకలు జరగాలి. ఎన్జీఓ కాలనీ వర్క్‌బోర్డు స్థలాలు అక్రమణకు గురి కాకుండా ముస్లీం పేదలకు ఉచితంగాను దళితులకు డబ్బులతోనూ స్థలాలు కేటాయించి, అందులో ప్రార్థన మందిరము, యూనాని వైద్యశాల, పార్కు, కమ్యూనిటి హాల్ తదితర వాటిని నిర్మించి, ముస్లీం మోడల్ సీటిగా ఏర్పాటు చేయాలి.
3.నంద్యాల ఆర్టీసి డిపో బస్సులు తెల్లవారు జామున తిరుపతి, హైదారబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు నూనెపల్లె బ్రిడ్జి మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి, సాయిబాబా నగర్, పోలీసు స్టేషన్ల మీదుగా పద్మావతి నగర్ ప్రధాన రహదారి నుంచి బస్టాండ్‌కు చేరుకోవాలి.
4.విజయ డైరీలో డైరీ పాలీటెక్నిక్, బివిఎస్ఈ కోర్సులను ఏర్పాటు చేయాలి.
5.నూనెపల్లె హైవే నుంచి జర్నలిస్టు కాలనీ మీదుగా నూనెపల్లె రోడ్డుకు కలుపుతూ డివైడర్లతో కూడిన డబల్ రోడ్డు కావాలి.
6.జాతీయ రహదారి నుంచి రైతు నగర్ మీదుగా నూనెపల్లె బ్రిడ్జి వరకు డివైడర్లను ఏర్పాటు చేసి మురికి కాలువలతో ఫుట్‌పాత్‌లు నిర్మించాలి
7.ప్రధమ నంది ఆలయ ప్రాంతం అక్రమణకు గురి కాకుండా మహానంది స్థాయిలో దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి.
8.ఎన్జీఓ కాలనీలో ఉన్న ప్రభుత్వ స్థలాలు ఖాబ్జాకు గురి కాకుండా ఇండోర్ స్టేడియం, డిజిటల్ లైబ్రరీ, పోలీసు స్టేషన్, కూరగాయాల మార్కెట్‌ను నిర్మించాలి.
9.ఎస్బిఐ కాలనీ కోట్లు విలువ చేసే మహానంది దేవస్థానం స్థలం ఉంది. ఇందులో భారీ కళ్యాణ మండపాలన్ని నిర్మించితే స్థలం అక్రమణకు గురి కాదు. పట్టణంలోని 42 వార్డులో ఆటో స్టాండ్లను, ఇతర వాహానాల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలి. అలాగే కీలకమైన ప్రదేశాలలో మున్సిపాలీటి ఆధ్వర్యంలో టాయిలెట్లను, ముఖద్వారాల దగ్గర కాలనీ పేర్లతో బోర్డులను ఏర్పాటు చేయాలి.
ఇవి కాకుండా మరికొన్ని రోజుల్లో జనాస్త్రం టీం పట్టణంలోనూ నంద్యాల, గోస్పాడు మండలాల్లోని సమస్యలను సేకరించి అభ్యర్థుల దృష్టికి తెచ్చి వారి హామిని కోరనున్నాం.