!!!నాంచుడు వ్యూహం… శిల్పా అనుకుంటే ఎంత సేపు!!!

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి

♠నాంచుడు  వ్యూహం

♠శిల్పా అనుకుంటే ఎంత సేపు

♠మౌనంలో మాబున్నిసా

♠ఛైర్మ‌న్‌కు ప్ర‌జా ప్ర‌తినిధి అండ

♠త్వ‌ర‌లోనే టీ క‌ప్పులో తుఫానుగా ముగుస్తుంది

నంద్యాల పుర‌పాల‌క సంఘం స‌మావేశంలో మున్సిప‌ల్ మాజీ ఛైర్మ‌న్ దేశం సులోచ‌న చేసిన ఆరోప‌ణ‌లు సొంత పార్టీ వారినే విస్మ‌యానికి గురి చేశాయి. అయితే ఈ స‌మ‌స్య శిల్పా కుటుంబీకులైన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డి, ఎమ్మెల్యే ర‌వి చంద్ర‌కిషోర్ రెడ్డి, కౌన్సిల‌ర్ నాగిని రెడ్డి ప‌రిధుల‌కు మించింది కాద‌ని వారు ఇంత‌వ‌ర‌కు నాంచుడు వ్యూహం కొన‌సాగించ‌డం లోని ఆంతర్యం ఆ పార్టీ కౌన్సిల‌ర్ల మ‌ధ్య‌నే విస్మ‌యం క‌లిగిస్తున్న‌ది. ముగ్గురు కుడా అవ‌స‌రం లేదు. ఏ ఒక్కొరైనా స‌రిపోతార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు చ‌ర్చించుకుంటున్నారు. దేశం సులోచ‌న‌, మున్సిప‌ల్ ఛైర్మ‌న్, మాబున్నిసా మ‌ధ్య‌న కొంద‌రూ ఆగ్ర‌హం ర‌గిల్చే విధంగా వ్య‌వ‌హారిస్తున్నార‌ని వారిని క‌ట్ చేస్తే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని మ‌రి కొంద‌రూ వైసిపి కౌన్సిల‌ర్లు చెబుతున్నారు. మున్సిప‌ల్ ఛైర్మ‌న్ మౌనంగానే పావులు క‌దుపుతున్నారు. శిల్పా కుటుంబీకుల‌తోనే ఈస్థాయికి ఎదిగాన‌ని అయితే త‌న‌కంటే త‌న పై ఆగ్ర‌హం చెందుతున్న దేశం సులోచ‌న‌కే శిల్పా మ‌ద్ద‌త్తు ల‌భిస్తున్న‌ద‌ని అందువ‌ల్లే తాను నోరు పారేసుకొకుండా మౌనంగా ఉన్నాన‌ని ,కాల‌మే తీర్పు చెబుతుంద‌ని వివ‌రిస్తున‌ట్లు స‌మాచారం. అయితే ఆమె వెనుక కుడా ఎమ్మెల్యే స్థాయి ప్ర‌జా ప్రతినిధి ఉన్నార‌ని అందుకే ఆమె ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మ‌రికొంద‌రి వాద‌న‌. ప్ర‌స్తుత ఎన్నిక‌ల ముంద‌ర మైనార్టీ అయిన మాబున్నిసా విష‌యంలో చూసి చూడ‌న‌ట్లే వ్య‌వ‌హ‌రించాల‌ని శిల్పా కుటుంబీకులు మౌనం దాల్చిన‌ట్లు తెలుస్తొంది. ఇదే దేశం సులోచ‌న‌కు కుడా శిల్పా కుటుంబం పై అసంతృప్తి క‌లిగిస్తున్న‌ట్లు స‌మాచారం. మొత్తం మీద శిల్పా కుటుంబీకుల చేత్తుల్లో బంతి ఉంద‌ని ఈనెల 28వ తేది రాత్రికి కానీ, 29వ తేది ఉద‌యానికి కానీ స‌మ‌స్య‌ను టీ క‌ప్పులో తుఫానుగా ముగించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు కొంద‌రూ కౌన్సిల‌ర్లు జ‌నాస్త్రంతో అన్నారు. ఎన్నో స‌మ‌స్య‌ల‌ను అవ‌లీల‌గా ఎదుర్కొ న్న శిల్పా కుటుంబీకులు ఇంటి మ‌నుషులుగా భావించే మాబున్నిసా, దేశం సులోచ‌న వ్య‌వ‌హ‌రం పెద్ద స‌మ‌స్య కాద‌ని ఆ కౌన్సిల‌ర్లు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *