♠ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔సేమ్ టూ సేమ్ భూమా
⇔ఎంపీ పరిధిలో యువత ఓట్లకు విఖ్యాత్‌తో గాలం
⇔మరోసారి భూమాను గుర్తు చేసుకుంటున్నా ఫ్యాన్స్
దివంగత భూమా నాగిరెడ్డి, శోభానాగి రెడ్డిల ముద్దుల తనయుడు, మాజీ మంత్రి అఖిల ప్రియకు ప్రీతిపాత్రమైన సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి తన పర్యటనను విస్తరించడంతో ఆయన వెళ్లే ప్రతి చోట భూమా ఫ్యాన్స్, టిడిపి కార్యకర్తలు, బ్రహ్మారథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్లిన ఆయన రాకకు సంతోషం వ్యక్తం చేస్తూ నాగిరెడ్డి కొడుకు వచ్చాడోచ్ అంటూ మహిళలు, పురుషులు చర్చించుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ విఖ్యాత్‌కు రాష్ట్ర స్థాయి యువతలో కీలక పదవిని ఇచ్చారు. భూమా నాగిరెడ్డి మరణించి ఎనిమిది సంవత్సరాలు అయినా ఆయన ఫ్యాన్స్ కళ్లలో ఆయన అవేశ ప్రసంగాల హావాభావాలు ఇప్పటికి చెక్కు చెదరడం లేదు. అంతేకాక నంద్యాలకు ఆళ్లగడ్డకు నీ ప్రచారం పరిమితమైందని పార్లమెంట్ మొత్తం విస్తరించి అక్కడ తెలుగుదేశం ఇంచార్జులకు భాసటగా నిలుస్తూ నాయన … నాగిరెడ్డి లాగా కార్యకర్తలకు భరోసా ఇచ్చి పార్లమెంట్‌లోని యువకుల ఓట్లు తెలుగుదేశం వైపు మొగ్గు చూపే విధంగా ప్రచారం నిర్వహించాలని విఖ్యాత్‌కు లోకేష్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
దీంతో గత కొద్ది రోజుల నుంచి నంద్యాలలో శిల్పా కుటుంబం పై విమర్శలు చేసిన విఖ్యాత్ ఆ తరువాత పాణ్యం, నందికొట్కూర్ నియోజకర్గ ఇంచార్జులు గౌరు చరిత, మాండ్ర శివనందారెడ్డిలు విఖ్యాత్‌ను ఆహ్వానించి సభలకు పరిచయం చేస్తున్నారు. విఖ్యాత్ కుడా గతంలో తండ్రి భూమా నాగిరెడ్డి ప్రసంగల దోరణితోనే అవేశంగా ప్రసంగిస్తూ సభలకు సమావేశాలకు హాజరైన వారితో కేరింతలు కొట్టిస్తున్నారు. రాష్ట్రంలో వైయస్ఆర్సిపి పాలనను ఎండగుడుతూ ముందుకు సాగుతున్నారు. మొత్తం మీద తండ్రికి తగ్గ తనయుడేనని భూమా వీరాభిమానులు చర్చించుకుంటున్నారు. నంద్యాల పార్లమెంట్‌కు 1992 నుంచి 1998 వరకు జరిగిన మూడు ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా భూమానాగిరెడ్డి విజయం సాధించి హ్యాట్రిక్ ఎంపీగా ఎంపికైయ్యారు. అంతకముందు ఆళ్లగడ్డకు రెండు దఫాలుగా ఆ తరువాత నంద్యాలకు ఒకసారి అసెంబ్లీకి ఎన్నికైన భూమా నాగిరెడ్డి బెరుకులేని రాజకీయలు చేశారు. స్థానిక ప్రత్యర్థుల పై రాజకీయ విమర్శలు చేయడంలో భూమా నాగిరెడ్డికి సాటివచ్చే వారు ఆయన మరణించే వరకు లేరు. ఇప్పుడు విఖ్యాత్ కుడా అంతకంటే ఎక్కువగా అనర్గళంగా ప్రత్యర్థుల పై ఆరోపణలు చేస్తూ తన ఇమేజిని చాటుకుంటున్నారు. పులి కడుపున పులే పుడుతుందని భూమా అనుచరులు వర్ణిస్తున్నారు.