ఆగ్ర‌హాం… త‌గ్గ‌ని.. సులోచ‌న‌..!!!

⊗ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

⇒సమ‌యమా … సమ‌ర‌మా?

⇒ఏటు తేల‌ని మున్సిప‌ల్ వివాదం

⇒అగ్ర‌హాం త‌గ్గ‌ని సులోచ‌న‌

⇒వ‌చ్చే స‌మావేశంలో తాడో … పేడో

నంద్యాల పుర‌పాల‌క సంఘంలో 18వ వార్డు వైసిపి కౌన్సిల‌ర్ దేశం సులోచ‌న చేసిన ఆరోప‌ణ‌ల మంట‌లు ఇప్పుడే చ‌ల్ల‌రేత‌ట్లు లేవు. ఈ ఆరోప‌ణ‌ల‌కు ప‌ది రోజుల్లో స‌మాధానం చెప్పాల‌ని లేని ప‌క్షంలో ప్ర‌భుత్వానికి ముఖ్యంగా సీఎంకు చెడ్డ పేరు వ‌స్తుంద‌ని 42 వార్డుల కౌన్సిల‌ర్లు, కో-ఆప్ష‌న్ మెంబ‌ర్లు, మున్సిపాలీటి టాప్ ఆర్డ‌ర్ అధికారులు, ప్రాతికేయుల స‌మ‌క్షంలో దేశం సులోచ‌న అగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. పుర‌పాల‌క సంఘం ప‌రిధిలో భారీ ఎత్తున అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని వీటి పై వివ‌రణ ఇచ్చి త‌మ నిజాయితీని చాటుకోవాల‌ని దేశం సులోచ‌న డిమాండ్ చేశారు. అయితే ఇంత‌వ‌ర‌కు మున్సిప‌ల్ అధికారుల నుంచి కానీ, ఛైర్మ‌న్ మాబున్నిసా నుంచి కానీ ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో ఆమె మ‌రింత అగ్ర‌హాంతో ఉన్నారు. ఎమ్మెల్యే శిల్పా ర‌విచంద్ర‌కిషోర్ రెడ్డి నిర్ణ‌యానికి మున్సిప‌ల్ ఛైర్మ‌న్, అధికారులు వ‌దిలేన‌ట్లు తెలుస్తొంది. నిగురూక‌ప్పిన నిప్పులాగా ఉన్న దేశం సులోచ‌న ఈనెల ఆఖ‌రిలో జ‌రిగే స‌మావేశంలో నిప్పులు చెల‌రేగే విధంగా సులోచ‌న అక్క వ్య‌హారించే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రూ కౌన్సిల‌ర్లు జనాస్త్రంతో అన్నారు. ఇది ఇలాగే నాన్చి మున్సిప‌ల్ స‌మావేశానికి రెండు రోజుల ముందు చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని అంచ‌న‌. కానీ సులోచ‌న భ‌ర్త దేశం సుధాక‌ర్ రెడ్డి ఎమ్మెల్యే వెంట‌నే రోజుకు ప‌ది గంట‌ల‌కు త‌క్కువ తిర‌గ‌డం లేద‌ని అయితే ఆయ‌న ఈవిష‌యం ఎమ్మెల్యే దృష్ణికి తెచ్చిన‌ట్లు లేద‌ని … ఎమ్మెల్యే కుడా అక్క ఇలా అగ్ర‌హాంతో స‌మావేశంలో పాల్గొంటున్నార‌ని దేశంను అడిగిన‌ట్లు లేదు. అయితే ఈ సీన్‌ను సులోచ‌న ప‌క్క‌న పాల్గొన్న ఎమ్మెల్యే స‌తీమ‌ణి నాగినిరెడ్డి స్వ‌యంగా చూడడ‌మే కాకుండా జీరో అవ‌ర్ మాట్లాడాల‌ని ఛైర్మ‌న్ అనే స‌మ‌యంలో సైగా చేసి వివాదం పెర‌గ‌కుండా చూసారు. అందువ‌ల్ల అక్క‌డ ఏం జ‌రిగింది. నాగిని రెడ్డి ఎమ్మెల్యేకు చెప్పి ఉంటార‌ని స‌మాచారం. మొత్తం మీద స‌మ‌యం కోర‌డామా లేక సంఘ‌ర్ష‌న‌కే సిద్ధ‌మ‌వుదామా అనే త‌ర్జ‌బ‌ర్జాన‌లో సులోచ‌న ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *