గెలిస్తే …ఆ మ‌జానే …వేరు….

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దన రెడ్డి

$ తెగించాలే గానీ కోట్ల‌లోనే ఆదాయం

$ నిజాయితీగా పోటీ చేసే వారికి స్వాగ‌తం – సుస్వాగ‌తం

$ ప్ర‌తి చోట ఆదాయం ఉంటుంద‌నే దురాశ‌

నంద్యాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల‌ని భావిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోవ‌డానికి అనేక కారణాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. కొంత‌మంది మాత్రం నిజంగా ప్ర‌జా సేవ చేయ‌డానికి పోటీకి ముందుకొస్తున్నారు. వీరికి నంద్యాల ప్ర‌జ‌లు కుడా స్వాగ‌తం ప‌లుకుతారు. అయితే సేవ ముసుగులో అక్ర‌మంగా కోట్ల రూపాయ‌లు డ‌బ్బులు ఆర్జీంచవ‌చ్చ‌ని కుడా ఆశ‌… అత్యాశా … దురాశ‌ల‌తో ముందుకు వ‌స్తున‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌న‌. గెలుపొందిన కొద్ది రోజుల నుంచే అక్ర‌మాల పర్వానికి తెర తీసే యోచ‌న‌లో ఉన్నారు. ఎమ్మెల్యే ప‌ద‌వీని అడ్డం పెట్టుకొని త‌మ‌కు అనుకూల‌మైన అధికారుల‌ను నియ‌మించుకొని కోట్ల సంపాద‌న‌కు లైన్ క్లీయ‌ర్ చేసుకొవ‌చ్చ‌ని దురాశ వారిలో నెల‌కొంది.

$ ఇలా సంపాదించుకొవ‌చ్చ‌ని అంచ‌న …

నంద్యాల ప‌ట్ట‌ణంలోని స్థలాలు పొలాల ధ‌ర‌లు కోట్ల‌లో ఉన్నాయి. బెంగుళూరు, హైద‌ర‌బాద్ ప‌ట్ట‌ణాల్లో ఉన్న ధ‌ర‌ల కంటే ప‌ద్మావ‌తి న‌గ‌ర్‌, శ్రీ‌నివాస న‌గ‌ర్‌, ఎన్జీఓ కాల‌నీ, రైతున‌గ‌ర్‌ త‌దిత‌ర ప్రాంతాల్లో ఉన్నాయి. ధ‌ర‌ల అమాంతంగా పెరిగిపోవ‌డంతో అన్న‌ద‌మ్ములు, తండ్రికోడుకులు, అన్న‌చెల్లిల్ల మ‌ద్య స్థ‌లా వివాదాలు విప‌రీతంగా ఉన్నాయి. కోట్ల ఆస్తి కావ‌డంతో వారి మ‌ధ్య‌న సమ‌న్వ‌యం లేక నాయ‌కుల‌ను, ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. వారు అధికారులతో సంప్ర‌దింపులు జ‌రిపి అనుకూల‌మైతే ఎంతో కొంత చేతిలో పెట్టి వారి ఆస్తుల‌ను అధికారికంగా కొట్టివేస్తున్నారు. ఇలా వివాదాల్లో ఉన్న ఆస్తులు రూ. 100 కోట్లకు పైగానే ఉంటాయి.

వీటి పై కొత్త అభ్య‌ర్థుల క‌న్ను.

నంద్యాల ప‌ట్ట‌ణంలోని కుందూ త‌దిత‌ర పాంత్రాల్లో ఇసుక విక్ర‌యాల ద్వారా కోట్ల‌లో ఆదాయం ఉంటుంది. అలాగే నెల్లూరు, జ‌మ్మ‌ల‌మ‌డుగు, తాడిప‌త్రి పాంత్రాల నుంచి ఇసుక‌ను నంద్యాల‌కు త‌ర‌లించి రెట్టింపు విక్ర‌యాల‌తో సంపాద‌న ఉంటుంద‌ని ఆలోచ‌న‌.

కేంద్రం రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి మంజూరైన భ‌వ‌నాలు, రోడ్ల టెండ‌ర్ల ద్వారా కాంట్రాక్ట‌ర్ల నుంచి కోట్ల‌లో గుడ్ వీల్.

రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ శాఖ‌ల నుంచి భారీ ఆదాయం వ‌స్తుంది. ఈ ఆదాయం పొందే అధికారులు ముందుగానే క‌ప్పం చెల్లించి ఇక్క‌డికి రావ‌చ్చు .వారు ఎంత ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేసిన ప్ర‌జా ప్ర‌తినిధులు ప‌ట్టించుకోరు.

నంద్యాల‌కు చుట్టుప‌క్క‌ల సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్ట‌రీల‌కు రవాణా టెండ‌ర్ల‌ను త‌మ‌కే దక్క‌ల‌ని ప‌ట్టుబ‌డ‌తారు. ఎవ‌రికి అధికారం ఉంటే వారే ఈ టెండ‌ర్ల‌ను కైవ‌సం చేసుకుంటారు.నంద్యాల పుర‌పాల‌క సంఘంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డితే కోట్ల‌లో ఆదాయం ఉంటుంద‌ని వీరి అంచ‌న‌. అధిక అంత‌స్తుల భ‌వ‌నాలు, అధిక విస్తీర్ణంలో ఉన్న స్థలాల‌తో వ‌చ్చే ఆదాయం కుడా కోట్ల‌లోనే .ఇక ఒత్తిడి తెస్తే త‌ప్పుడు రాతలు రాసి మున్సిపాలీటి నుంచే త‌మ వాహానాల‌కు డీజ‌ల్‌, పెట్రోల్ ప‌ట్టుకోవ‌చ్చు. ఇలా పాడిగా నిత్య ఆదాయ వ‌న‌రుగా మున్సిపాలీటిని వాడుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఆరోప‌ణ‌లను ప్ర‌తిప‌క్షమే కాదు, అధికార ప‌క్షంలో అసంతృప్తి వ‌ర్గం కుడా ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ది.

ప్ర‌భుత్వ రేష‌న్ బియ్యం,లిక్క‌రు అక్ర‌మ వ్యాపారులు కుడా కోట్ల‌లోనే ఆదాయం ఉంటుంది. ఇలా ఎన్నో ర‌కాల ఆదాయాలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపొందితే ఆ మ‌జానే వేరుంటుంద‌ని కొంత మంది అక్ర‌మార్కులు అసెంబ్లీ సీట్ పై క‌న్ను వేశారని చ‌ర్చ‌లు హాట్ టాపిక్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *