వ‌స్తే కొండా… రాకుంటే వెంట్రుక …

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి

$ లోగుట్టు పెరుమాళ్ల‌కు ఎరుక

$ క‌నీస ఓట‌ర్ బ‌లం లేని వారు కుడా 

$ అంద‌రూ కాదు … కొంద‌రైతే బ‌ల‌మైన అభ్య‌ర్థులే పోటీలో

$ ఓక జాతీయపార్టీ తరుపున రెండు కోట్ల ఆఫర్ అనే ప్రచారం

రాష్ట్రంలో ఏఫ్రిల్ నెల‌లో జ‌రిగే అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు పోటీ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపొతుంది. 175 అసెంబ్లీ, నియోజ‌క‌వర్గాల్లో, 25 పార్ల‌మెంట్, నియోజ‌క‌వర్గాల్లో ముక్కొణం పోటీ జ‌రుగుతుంది. అయేతే ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు కాకుండా ప్ర‌తి నియోజ‌క‌వర్గంలో ప‌ది పైగానే నామినేష‌న్‌లు ప‌డే అవ‌కాశం ఉంది. వైయ‌స్ఆర్సిపి, కాంగ్రెస్ పార్టీలు సింగ‌ల్‌గానూ, తెలుగుదేశం, జ‌న‌సేన సంయుక్తంగానూ పోటీ చేస్తాయి. పొత్తు కుదిరితే వీరితో బిజేపి క‌లిసి పోటీ చేస్తుంది. ఈడికి ముక్కొణం పోటీ కాగా సిపిఐ, సిపిఎంతో పాటు మ‌రికొన్ని జాతీయ, రాష్ట్రీయ‌ పార్టీల త‌ర‌ఫున పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు త‌హ‌త‌హాలాడుతున్నారు. ఇవి కాకుండా ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం ఐదు మంది అభ్య‌ర్థులు ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవ‌కాశం ఉంది. వీరందరూఎదోెోో ఓక పార్టీ టిక్కెట్ వ‌స్తే బంగారు కొండగా భావిస్తున్నారు. లేకుంటే నా పిక్క‌మీద వెంట్రుక అన్న విధంగా సిద్ధం అవుతున్నారు.

పోటీకి కార‌ణాలు ఇవి

పోరాడితే పొయింది ఏమి లేదు. డిపాజిట్ మాత్ర‌మే. కొంత ఖ‌ర్చు పెట్టుకుంటే నియోజ‌క‌ర్గంలోని కులాలు, మ‌తాల ఓట్లు ప‌డ‌తాయ‌ని కొంద‌రి ఉత్సాహం

-మ‌రికొంద‌రూ స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి చందాలు వ‌సూలు చేసుకొని ప్ర‌చారం చేసేది త‌రువాత.

-కొన్ని నియోజ‌క‌ర్గాల్లో అయితే ఒక జాతీయ పార్టీ పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు రూ.2 కోట్ల వ‌ర‌కు అసెంబ్లీకి మ‌రో రూ.5 కోట్లు, పార్ల‌మెంట్ అభ్య‌ర్థుల‌కు విరాళంగా ఇస్తారని అన‌ధికారికంగా ప్ర‌చారం సాగుతున్న‌ది. దీంతో మ‌రికొంత మంది ఉత్స‌హాం చూపుతున్నారు.

-కొంద‌రూ గ‌త ఐదు ఏళ్ల‌లో ఎంపీ, ఎమ్మెల్యేల వెంట తిరుగుతూ ఎలాంటి ప్ర‌యోజ‌నం పొంద‌క‌పోవ‌డంతో వారిపై ప‌గ‌తో ప్ర‌త్య‌ర్థికి మేలు చేసే విధంగా బరిలోకి దిగే యోచన‌లో ఉన్నారు. వీరికి స్థానిక ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీ అభ్య‌ర్థులు అదే పార్టీకి చెందిన నేత‌లు డ‌బ్బులు ఇస్తార‌ని స‌మాచారం ఉండ‌డంతో రెబ‌ల్‌గా పోటీ చేసే యోచ‌న‌లో ఉన్నారు.

-చాల‌మంది ఇండిపెండెంట్లుగానూ, ఎన్నిక‌ల సంఘం గుర్తింపు పొందిన పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తే పోలింగ్ రోజున జ‌న‌ర‌ల్ ఏజెంట్‌గానూ, బూత్ ఏజెంట్ల‌గానూ, అభ్య‌ర్థి త‌ర‌ఫున వాహానాలు తిర‌గ‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తారు. ఈ అవ‌కాశాన్ని డ‌బ్బులు తీసుకొని ప్ర‌ధాన రాజ‌కీయ‌ పార్టీల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా వ్య‌వ‌హరించ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు.

-అలాగే అసెంబ్లీ, నియోజ‌క‌ర్గంలో ఉన్న‌ పొలింగ్ కేంద్రాల‌లో ఏజెంట్లు పెట్టుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఈ ఫారాల‌ను కుడా రాజ‌కీయ పార్టీలకు ఇచ్చి ల‌క్ష‌ల్లో డ‌బ్బు క్యాష్ చేసుకొవ‌చ్చ‌ని ఆలోచ‌న‌. ఇలా ఒక్కొక్క‌రూ ఒక్కొ ఆలోచ‌న‌తో నామినేష‌న్లు వేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. ప్ర‌జ‌లు మాత్రం కొంద‌రూ ఉత్స‌హాం చూపే అభ్య‌ర్థుల‌ను చూసి ఏం బ‌లం ఉంద‌ని నామినేష‌న్ వేయాల‌ని అనుకుంటున్నారు. అస‌లు క‌థ జానాస్త్రం చెప్పిన‌ అంశాలు తెలిస్తే లోగుట్టు అత్య‌ధిక అభ్య‌ర్థుల్లో బ‌య‌టప‌డుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *