మనజగజ్జనని ఆలయంలో అంతా ఉచితం..ఉచితం..ఉచితం..

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దన రెడ్డి

#ఈ దేవాలయంలో టికెట్లే లేవు
#ఉచితంగా చీరెల పంపిణీ..

# కోటి విలువచేసే చీర అయిన భక్తులకుఉచితం

#బంగారం వెండి విరాళాలు నో
#రోజూ ఉచిత భోజనం.. అల్పాహారం..
#రాహుకాల పూజలు ఈ ఆలయం ప్రత్యేకత..

#వివరాలకు 9502563712   9866727123

ప్రపంచంలోనే రెండవ దేవలంగా పిలువబడుతున్న నంద్యాల జగజ్జననీ దేవలాన్ని నయాపైసా చెల్లించకుండా దర్శనం చేసుకునే భాగ్యాన్ని నిర్వాహకులు కల్పిస్తున్నారు. 25 ఏళ్లకు పైగా జగజ్జననీ దేవాలయంలో సాధారణ వీఐపీ అనే తేడా లేకుండా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. పది రకాల పూజలు ఈ ఆలయంలో నిర్వహిస్తుంటారు. ఏ పూజకు గానీ దర్శనానికి గానీ దేవస్థానం నిర్వాహకులు వసూలు చేయరు. మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు మినహాయిస్తే ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆలయ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఉదయం నుండి రాత్రి వరకు అల్పాహారం, భోజన వసతిని కూడా భక్తులకు ఉచితంగా కల్పిస్తుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సాధారణ రూం వసతిని కల్పిస్తూ ఒక్కపైసా రూం రెంట్‌ను వసూలు చేయరు. రాహుకాల పూజలు ఈ ఆలయం ప్రత్యేకత.ఇటీవల ప్రవేశపెట్టిన యమగండ నివారణ పూజలు కూడా ప్రజలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. భక్తులు అమ్మవారికి ఇచ్చే చీరెలన్నింటినీ ఎలాంటి రుసుం వసూలు చేయకుండా ఆలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా అందజేస్తుంటారు. మరో 10వేల చీరెలు హరిజనవాడల్లోనూ.. ఆలయానికి సమీపంలో ఉన్న గ్రామాలకు వెళ్లి జగజ్జననీ కార్యకర్తలు పంపిణీ చేస్తుంటారు. సాధారణ భక్తులకైనా, వీఐపీ భక్తులకైనా ఎంత విలువైన చీరైనా ఇస్తుంటారు. ఆలయంలో అమ్మవారికి బంగారు, వెండిని విరాళంగా భక్తులు ఇస్తామంటే తీసుకోరు. ఆలయ అభివృద్ధికి విరాళం ఇస్తే మాత్రం రసీదు ఇచ్చి తీసుకుంటారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆలయంకు వచ్చే భక్తులు ఆలయ నిబంధనలు పాటిస్తే సరిపోతుందని పాటించని వ్యక్తులు ఆలయంకు రావాల్సిన అవసరం లేదని వారికి అమ్మవారు మేలు చేకూర్చదని నిర్వాహకులు శివనాగ పుల్లయ్య, నారాయణ తెలిపారు. దాదాపు ఐదు భాషల్లో జగజ్జననీ ఆలయ చరిత్రను ముద్రించి రూ. 100 విలువ చేసే పుస్తకాలను కన్నడ, హిందీ, తమిళ్‌ భక్తులకు ఉచితంగా అందజేస్తుంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు ప్రత్యేక వాహనాల ద్వారా నంద్యాలకు చేరుకొని దర్శనం చేసుకోవడం విశేషం. నిష్టతో అమ్మవారికి అర్చన, వడిబియ్యం తదితర పూజలు చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుందని ఆలయ నిర్వాహకులు శివనాగ పుల్లయ్య, నారాయణలు తెలిపారు. మహిళా భక్తులు వేల సంఖ్యలో మంగళవారం, శుక్రవారం, దసరా సమయంలోనూ వస్తుంటారని వారందరికీ అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పులయ్య, నారాయణలు తెలిపారు.

One thought on “మనజగజ్జనని ఆలయంలో అంతా ఉచితం..ఉచితం..ఉచితం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *