అసెంబ్లీ ఎన్నికల రేసులో కౌన్సిలర్ శ్యాం

జనాస్త్రo ప్రతినిధి మారం రెడ్డి జనార్దన రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల రేసులో కౌన్సిలర్‌ శ్యాం..

మూడేళ్ల క్రితం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో సంచనల విజయం సాధించిన ఖండే శ్యాంసుందర్‌ లాల్‌ రాజకీయం సస్పెన్ష్‌గా కొనసాగుతున్నది. రెండేళ్ల క్రితం అధికార పార్టీ నేతలైన శిల్పామోహన్‌ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డిలతో మంతనాలు జరిపి 12వ వార్డులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి బీ`ఫారం ఇవ్వాలని కోరారు. మరికొన్ని వార్డుల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తానని పురపాలక సంఘంలో వైస్‌ చైర్మన్‌గా కానీ.. మున్సిపల్‌ చైర్మన్‌గా అవకాశం ఇస్తే తన భార్యను కౌన్సిలర్‌గా పోటీ చేయిస్తానని కూడా కోరారు. అయితే కౌన్సిలర్‌ దగ్గర నుండి ఏ అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని వైసీపీ నాయకులు చెప్పడంతో ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి రాంగోపాల్‌ రెడ్డిని భారీ మెజార్టీతో ఓడించారు. దీంతో రాయలసీమలోని ప్రధాన నాయకులు అందరూ శ్యాంకు ఉన్న ప్రజా బలాన్ని మెచ్చి అభినందనల వర్షం కురిపించడమే కాకుండా సన్మానాలు చేశారు.

శ్యాం గెలుపులో కీలక అంశం ఏమంటే ఆయన ఆర్యవైశ్య సంఘం నాయకుడిగా కొనసాగుతూ అన్ని కులాల్లో పేదలను దరి చేర్చుకుని సహాయం చేశారు. అంతేకాక నంద్యాల పట్టణంలోని ప్రముఖ దిన పత్రికలకు పాత్రికేయుడిగా కొనసాగడమే కాకుండా ఏపీయూడబ్య్లూజే సంఘంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర నాయకుడిగా చలామని అయ్యారు. దీంతో పాత్రికేయులు చలంబాబు, మధు తదితరులు కీలక భూమికను పోషించి ఆయన విజయంకు కృషి చేశారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి నంద్యాల పట్టణంలో అతి దగ్గరి పది మందిలో శ్యాం మూడు నాలుగు స్థానాల్లో ఉంటారు. ఆయనను ఏదో ఒక పార్టీ నుండి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయమని ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల తరుపున పోటీ చేయమని తమ వంతు సహకారం అందిస్తామని ఒక ప్రధాన రాజకీయ పార్టీ నుండి ఆహ్వానం అందించినట్లు సమాచారం. మొత్తం మీద ఈయన రాజకీయ కదలికలను గుర్తించి మూడు మాసాల్లో జరిగే నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని వైఎస్‌ఆర్‌సీపీ తరుపున శిల్పా మోహన్‌ రెడ్డి, టీడీపీ తరుపున ఫరూక్‌లు స్వయంగా కలిసి అభ్యర్థించారు. ఇది ఇలా ఉండగా ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకున్నా తనతో సంప్రదించి తీసుకోవాలని కాటసాని రాంభూపాల్‌ రెడ్డి చేసిన సూచన మేరకు ఆయన ఊగిసలాడుతున్నట్లు సమాచారం.

One thought on “అసెంబ్లీ ఎన్నికల రేసులో కౌన్సిలర్ శ్యాం

  1. మా శ్యాం సుందర్ లాల్ అన్న రాజకీయ రంగంలో రాణించాలని , అన్న ఏ నిర్ణయం తీసుకున్నా నంద్యాల ఆర్య వైశ్య్యులే కాకుండా శ్యాం అన్న స్వగ్రామం సిరివెళ్ల ఆర్య వైశ్యుల సపోర్ట్ కూడా పూర్తిగా ఉంటుందని తెలియజేస్తున్నాము ??❤️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *