
జనాస్త్రంప్రతినిది మారంరెడ్డి జనార్దన రెడ్డి
తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంచార్జి ఎన్ ఎండి పరూఖ్ తన ప్రత్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డిపై దూకుడు పెంచాలని నిర్ణయించారు. ఇంచార్జిగా భాద్యతలు స్వీకరించినప్పటినుండి ఇంతవరకు ప్రశాంతంగా రాజకీయాలుచేస్తున్న పరూఖ్ దూకుడుగా రాజకీయాలుచేస్తే తప్ప ప్రజలు ,పార్టీలో తన మైలేజీ పెరగదని నిర్ణయించారు.పరూఖ్ తనయుడు పిరోజ్ దూకుడుగానే వ్యవహరిాస్తున్నా ఆకిక్ కార్యకర్తలకు వంటపట్టడంలేదు. పరూఖ్ వెంట తిరుగుతున్న రాష్ట్ర ప్రధానకార్యదర్శి,న్యాయవాది తులసిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు ప్రజలనుంచి స్పందన అనూహ్యంగా ఉంది. ఇకతాను కూడా శిల్పా కుటుంబాన్ని టార్గెట్ చేసుకోవాలని అప్పుడే తన మైలేజీ ఆకాశానికి తగులుతుందని పరూఖ్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనితో ముస్లింలకు ఇతరులకు అన్యాయం జరిగే ప్రతి అంశాన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయాలని క్యాడర్ కు పరూఖ్ ఆదేశించారు.ఎక్కడైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను శిల్పా అనుచరులుచేస్తుంటే డీకొనాలని తాను కూడా మీకంటే ముందు ఉంటానని క్యాడర్ కు భరోసా ఇచ్చారు..దీనితో దూకుడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయిందని పరూఖ్ అనుచరులు పేర్కొంటూ సంతోషాన్ని కూడా వ్యక్తంచేస్తున్నారు..పోలింగు వరకు ఇదే మాటమీద పరూఖ్ నిలబడే విషయంపై కార్యకర్తలలో చర్చలు సాగుతున్నాయి.
Post Views: 564
Like this:
Like Loading...