ఎంట్రీానే టాప్

జనవరి 11

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మూడు ప్రదానపార్టీల రాష్ట్ర అద్యక్షులు కాంగ్రెస్ తాను ముక్కలేనని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం వైకాపా ముఖ్య మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న చంద్ర‌బాబు, కాంగ్రెస్ పార్టీ నుంచే బ‌య‌ట‌కి వ‌చ్చి ఇరువురు ప్రాంతీయ పార్టీల‌ను పెట్టుకొని ముఖ్య‌మ‌త్రులుగా ప‌నిచేశారు. త్వ‌ర‌లో రాష్ట్ర అధ్య‌క్షురాలు బాధ్య‌త‌ల‌ను స్వీకరిస్తార‌ని భావిస్తున్న ష‌ర్మిల కుడా ఆమె తండ్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో క‌డ‌ప ఎంపీగా, పులివెందుల ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా, ముఖ్య మంత్రిగా ప‌నిచేశారు. ష‌ర్మిల కుడా ఆయ‌న త‌ర‌ఫున రాజ‌కీయ‌ వార‌స‌త్వాన్ని పునికి పుచ్చుకొవ‌డంతో ఈమె కుడా కాంగ్రెస్ వ్య‌క్తే అయ్యారు. చంద్ర‌బాబు నాయుడు కుడా 1978 ప్రాంత్రంలో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున చంద్ర‌గిరి నుంచి పోటీ చేసి రాష్ట్ర మంత్రిగా ప‌నిచేశారు.

అయితే ఆ త‌రువాత మామ రామ‌రావు పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరి ఆ త‌రువాత మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల దృశ్య టిడిపి అధ్య‌క్షుడుగాను మంత్రిగాను ప‌ని చేశారు. ఇకా వైకాపా అధ్య‌క్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించారు. మొత్తం మీద ముగ్గురు స్వతంత్రంగా పార్టీని ఏర్పాటు చేయ‌లేదు. కాంగ్రెస్ ర‌క్తంతోనే ఆ పార్టీకి మాజీలు అయ్యి వివిధ పార్టీల ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం మీద ప్ర‌స్తుత ముఖ్య‌మంతి జ‌గ‌న్‌, మాజీ ముఖ్య‌మంత్రి బాబు, పార్టీ అధ్య‌క్షురాలు త్వ‌ర‌లో బాధ్య‌తలు తీసుకుంటార‌ని భావిస్తున్న ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీ కావ‌డం రాష్ట్రంలో కాకుండా జాతీయ స్థాయిలో కుడా చ‌ర్చ సాగుతున్న‌ది.

అక్కడ మరోలా

ఆంద్రప్రదేశ్లో ఇలా ుంటే తెలంగాణాలో మరోలా ఉంది..తెలంగాణాలో తెలుగుదేశం పార్టీనుంచి వచ్చిన నాయకులకు ముఖ్యమంత్రి పదవులు అబ్బాయి..తెలుగుదేశం అదినేత దివంగత ఎన్ టి ఆర్ కు శిష్యుడైన కెసి ఆర్, తెలుగుదేశంపార్టీనుంచి దూరమై తెలంగాణా టి ఆర్ ఎస్ పార్టీని ఏర్పాటుచేసుకుని పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు..అలాగే తెలుగుదేశంలో చంద్రబాబు శిష్యుడైన రేవంతరెడ్డి రాష్ట్ర విభజనతో టిడిపికి బై చెప్పారు..ఆ తరువాత కాంగ్రెస లోచేరి మూడు మాసాల క్రితం ముఖ్యమంత్రి అయ్యారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *