నంద్యాల జనవరి 09
జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
రాజకీయ వ్యూహాలలోకాకలు తీరిన యోధుడైన శిల్పా మోహనరెడ్డి 2024 ఎన్నికలలో ఏతెరపై కనిపిస్తారో అర్ధంకాని పరిస్థితి నెలకొంది..గత 10 సంవత్సరాలనుండి విశ్రాంతి తీసుకుంటున్న శిల్పామోహనరెడ్డి ఈ సారి ఎన్నికలలో ప్రత్యక్షంగా ప్రజలకు దగ్గర కావాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది… 2004,2009 ఎన్నికలలో నంద్యాల అసెంబ్లీకి ఎన్నికయి మంత్రిగా కూడా పనిచేశారు.వైయస్ ప్యామిలీ ముద్రకలిగిన శిల్పా మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం తెలుగుదేశంలోకి వెళ్లి ఆ తరువాత తిరిగి తనకు ప్రీతి పాత్రమైన వైయస్ ఆర్ గూటికి చేరుకున్నారు..2019 ఎన్నికలలో నంద్యాల ఎన్నికల బరినుంచి తప్పుకుని తన ముద్దుల తనయుడు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డిని బరిలోకి దించారు. 35వేల మెజారిటీతో గెలిచే విదంగా ప్రణాళికను రూపొందించుకుని అమలుచేశారు..అయితే ఈ సారి రవి స్థానంలో తండ్రి మోహనరెడ్డే బరిలోకి దిగుతారని భావించారు..రవి నంద్యాల ఎంపిగా వైయస్ ఆర్ సిపి తరుపున పోటీచేస్తారని ప్రచారం జరిగింది..ఈ ప్రచారానికి తెర దించుతూ వారం రోజుల క్రితం నంద్యాలలో జరిగిన సాదికారిక బస్సు యాత్రలో పాల్గొని తన బిడ్డ శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డిని తిరిగి నంద్యాల ఎంఎల్ఎ గా ఆశీర్వదించాలని బహిరంగ సభలో కోరడంతో తాను అసెంబ్లీకి పోటీచేయనని చెప్పకనే చెప్పారు .
నంద్యాల పార్లమెంటు బరిలోకి ?
అయితే మోహనరెడ్డి నంద్యాల పార్లమెంటుకు పోటీచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల జరిగన అంతర్గత సదస్సులలో పార్టీ నాయకులు దేశం సుదాకరరెడ్డిాతో సహా మరికొందరు పార్లమెంటుకు అవకాశం ఇస్తే వైసిపి తరుపున పోటీచేయాలని వత్తిడి తెస్తున్నారు..మరో పదేండ్లు మీరు ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనడానికి భగవంతుడు ఆశీస్సులు అందించారని అందువల్ల ఈ సమయాన్ని పార్లమెంటు ప్రజలకు సేవలు ఇచ్చే విదంగా పోటీ చేయాలని వారు వత్తిడి తెస్తున్నట్లు సమాచారం..అంతేకాక తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి , కౌన్సిలర్ శిల్పా రవి సతీమణి నాగినిరెడ్డి కూడా పార్లమెంటుకు పోటీ చేస్తే బాగుంటుందని మోహనరెడ్డికి సూచించినట్లు సమాచారం..మొత్తంమీద శిల్పాకూడా ఏదోఒక పోటీలో ఉండాలని ఇందుకు అవసరమైన గ్రౌండును ప్రిపేరు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది..తాను అనుకున్న లక్ష్యంకు జగన్ ముద్ర వేస్తే తప్ప మౌనంగానే రాజకీయాలు నడపాలని మోహనరెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది.పార్లమెంటుకు అవకాశం వస్తే అప్పటికప్పడు నియోజకవర్గాలవారిగా అవగాహన సంపాదించడం కంటే ఇప్పుడే తెలుసుకుని ఉండడం మంచిదనిా అనుకుంటున్నారు..మొత్తం మీద మౌనంగా రాజకీయ కదలికలను కొనసాగించాలనే నిర్ణయంలో శిల్పా మోహనరెడ్డి సిద్దహస్తుడు కావడంతో ఏ విషయం బయటికి పొక్కడంలేదు.
Post Views: 835
Like this:
Like Loading...