హైదరాబాదు జనవరి 06(జనాస్త్రం)
దేశంలో తొలిసారిగా గతేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ జరిగిన విషయం తెలిసిందే. హుస్సేన్ సాగర్ తీరం వెంబడి రేసింగ్ కార్లు ఈ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ లో పరుగులు పెట్టాయి. ఇంటర్నేషనల్ ఫార్ములా రేసింగ్ ఛాంపియన్షిప్ ని చూడడానికి హైదరాబాద్ నగరానికి పలువురు వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు క్యూ కట్టారు. అయితే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో ఫార్ములా ఈ రేస్ ను రద్దు చేస్తున్నట్టు ఎఫ్ ఐ ఏ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని నెరవేర్చకూడదనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉటంకిస్తూ వారు సంచలన నిర్ణయం తీసుకున్నారు.