జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
చుట్టుపక్కల చెట్లు పచ్చన
కొమ్మలు మాత్రమే కట్ చేయాలి
ప్రమాదపు అంచులలో కొమ్మలు
కొమ్మకొమ్మకో సన్నాయి…కోెటిరాగాలు ఉన్నాయి ..అనే పాటను విన్నాము,పాడాము..కాని నంద్యాలపట్టణంలోని ఎన్జిఓ కాలనీ హౌసింగు బోర్డులోని ప్రదాన రహదారిలో ఒక పురాతన భారీ చెట్టు కొమ్మలు ఎప్పుడూ తెగిపడతాయో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో నన్న భయం ప్రజలను వెంటాడుతున్నది..హౌసింగు బోర్డులోని శరభయ్య అంగడి దగ్గర ఉన్న చెట్టు మాత్రమే పూర్తిగా ఎండిపోయింది..చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ పచ్చగా ఉండి ఇది ఒక్కటి ఎండి పోవడం పలువురికి ఆందోళన కల్పిస్తున్నది..గతంలో అందరికి నీడ నిచ్చిన చెట్టు ఇప్పుడు ఎండి పోయి ప్రమాదకరంగా మారడం పలువురిని ఆందోళన కల్గిస్తున్నది..ఈ రహదారిలో రోజుకు వేలాదిమంది వాహనాలను నడిచి తిరుగుతుంటారు..అందువల్ల చెట్టు కొమ్మలను మాత్రమే నరికి ప్రదాన చెట్టును అలాగే ఉంచి వెయ్యాలని స్థానికులు కోరుతున్నారు..మునిసిపల్ అదికారులు ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిదని జనాస్త్రంకు వివరించారు..