✤ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
⇒ మరాఠి ముద్దుబిడ్డ మణికర్ణిక చిత్ర ప్రదర్శన
⇒ సినిమా షూటింగులను మైమరపించే భారీ ప్రదర్శన
⇒ 550 మంది విద్యార్ధులతో స్వాతంత్ర స్పూర్తి రగిలించారు.
కర్నూలు నగరంలోని కేశవరెడ్డి పాఠశాలల విద్యార్థులు 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని పెరేడ్ గ్రౌండ్ లో మణికర్ణిక చిత్ర నేపథ్యంతో సాగిన నృత్య ప్రదర్శన ఆద్యంతం ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఈ సందర్భంగా మరాఠీ ముద్దుబిడ్డ యైన *ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా మణికర్ణిక చిత్రాన్ని క్లుప్తంగా చిత్రీకరిస్తూ భారీ సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్ తో 550 పైగా కేశవరెడ్డి విద్యార్థులు నభూతో నా భవిష్యత్ అన్న చందంగా సాగిన నృత్య ప్రదర్శన కర్నూలు నగర ప్రజలను, ముఖ్య అతిథులను మంత్రముగ్ధులను చేశాయనడం లో అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నుండి మెమోంటో తో పాటు ప్రథమ బహుమతిని కేశవరెడ్డి పాఠశాలల వ్యవస్థాపక అధ్యక్షులు యన్. కేశవరెడ్డి అందుకున్నారు. అనంతరం కేశవరెడ్డి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే 1857 సంవత్సరంలో బ్రిటిష్ వారి దుష్టపాలనను ఎదిరిస్తూ స్వతంత్ర పోరాటాన్ని సల్పిన వీరనారీమణి మన ఝాన్సీ లక్ష్మీబాయి అని అన్నారు. స్త్రీల శక్తి సామర్థ్యాలను, వారి యుద్ధ పటిమను ఈ విశ్వానికి చాటి చెబుతూ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దాస్య శృంఖలాలను తెంచుకొని స్వేచ్ఛా పథంలో ప్రజలను నడిపించిన ధైర్యశాలి ఝాన్సీ లక్ష్మీబాయి అడుగుజాడల్లో ప్రతి విద్యార్థి నడుస్తూ దేశానికి తమ వంతు సేవ చేయాలన్నారు. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ , కర్నూలు నగర ప్రజలు, కేశవరెడ్డి యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు.