✤శ్రీశైలం చైర్మన్ పై ఉత్కంఠత✤

✤ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

⇒ చైర్మన్ పదవి కోసం బుడ్డా పట్టు

⇒ పెస్టివల్ కమిటీనా…పాలకమండిలినా..

⇒ సభ్యుల సంఖ్య పెంచే అవకాశం

శివరాత్రి పండుగ కు ముందు దేవాదాయ శాఖ కు చెందిన నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారా ?లేక ఫెస్టివల్ కమిటీ పేరుతో ముగ్గురు టీడీపీ నాయకులతో కమిటీ లను వేస్తారా అనే చర్చ జరుగుతున్నది..ఒక్క నంద్యాల జిల్లా లోనే శ్రీశైలం,మహానంది క్షేత్రలకు పాలక మండలి సభ్యులను నియమించాల్సి ఉంది.శ్రీశైలం శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖరరెడ్డి ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ముగ్గురు ప్రధాన నాయకుల పేర్లను శ్రీశైలం చైర్మన్ గా నియమించాలని సూచించినట్లు తెలుస్తోంది..గత కొద్ది సంవత్సరాలనుండి రాష్ట్రంలోని ప్రధాన నాయకులను చైర్మన్ గా నియమించే సాంప్రదాయం నెలకొంది..ఇందులో భాగంగా నెల్లూరుకు చెందిన ఆదినారాయణరెడ్డి ,నగరికి చెందిన చక్రపాణిరెడ్డిని నియమించారు..ఇప్పుడు కూడా శ్రీశైలం నియోజకవర్గంకు చెందిన వారిని నియమిస్తారా ..లేక బుడ్డా పట్టుపట్టిన నేతను నియమిస్తారా అనే చర్చ సర్వత్రా సాగుతున్నది..బుడ్డారాజాకు సిఎం దగ్గర, లోకేష్ దగ్గర మంచి పేరు ఉండటంతో ఆయన సూచించిన నాయకుడికే చైర్మన్ పీఠం దక్కుతుందన్న చర్చ సాగుతున్నది..మహానందికి అయితే ఎలాగూ బుడ్డా చెప్పిన పేరే ఖరారు అవుతుందని,శ్రీశైలం మాత్రం ఇంకా పైనల్ కాకపోవడంతో ఉత్కంఠత నెలకొంది..ఈ రెండింటి తో పాటు యాగంటి,బొగేశ్వరం,ఓంకారం,తో పాటు మరికొన్ని శివాలయాలలో శివ రాత్రి వేడుకలు బ్రహ్మాండగా జరుగుతాయి..ఒక్క ఆలయం కమిటీ లో చైర్మన్ తోపాటు గతంలో 11 మంది పాలకమండలి సబ్యులను నియమించారు..అందులో సగం మంది మహిళలు ఉండగా వీరిలో కనీసం 5నుంచి 6 మంది బిసి,యస్ సి,యస్ టి వర్గాలకు చెందిన వారిని నియమించేవారు..ఆలయపురోహితుడు సభ్యుడిగా కొనసాగుతారు..అయితే ఈసారి భజంత్రీని ,బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఒకరిని అదనంగా చేర్చాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి..వీరుకాకుండా మరో ముగ్గురు నుంచి ఐదు మంది సభ్యులను పెద్ద దేవాలయాలకు పెంచే ప్రతిపాదన ఉంది..కూటమిలో తెలుగుదేశంతో పాటు,బిజెపి,జనసేన సబ్యులు కూడా పాలకమండలిలొో అవకాశం కల్పిస్తారని చర్చలు జరుగుతున్నాయి..వారికోెసమే ఈ జాప్యం జరిగింది అనికూడా అనుకుంటున్నారు.. …టీడీపీ రాష్ట్రం లో అధికారం లోకి వచ్చి 7మాసాలు అవుతుంది..ఇంత వరుకు ఈ పదవులను భర్తీ చేయలేదు..రాష్ట్రం లో 500 దేవాలయాలకు పాలకమండలి సభ్యులను నియమించాలి.ఐతే కూటమి పార్టీ లలో ఎవ్వరికి ఏ ఆలయం ఇవ్వాలని సందిగ్ధత నెలకొంది.రాష్ట్రం లోని అన్ని ఆలయం లలో 85 శాతం టీడీపీ కి 10 శాతం జనసేనా,5శాతం బీజేపీ కి ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది..పండుగ ముగిసిన తరువాత పదువు లు ఇచ్చినా ఏం ప్రయోజనం అని కూటమి పార్టీ నాయకులు అంటున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *