⊗జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⊗న్యాయవాది వృత్తిలోకి శోభ రాఘవేంద్ర తనయుడు….
నంద్యాల పట్టణంలోని ప్రముఖ శోభ లాడ్జి అధినేత రాఘవేంద్ర తనయుడు కృష్ణ చైతన్య న్యాయవాది వృత్తిలో ప్రవేశించబోతున్నారు ఒకవైపు లాడ్జి వ్యాపారాన్ని చూస్తూనే మరోవైపు అత్యాధునిక పరికరాలతో ఆరు ఏడు సంవత్సరాల నుండి నంద్యలపట్టణంలోని తమ స్వంత లాడ్డి ప్రాంగణంలో జిమ్ ను నడిపిస్తున్నారు.ప్రతిరోజు 200 మంది యువతి యువకులకు శిక్షణ ఇస్తూ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేస్తున్నారు.బిటెక్ చదివిన కృష్ణ చైతన్య గత మూడు సంవత్సరాల నుండి కర్నూలు ప్రసన్న లా కాలేజీలో న్యాయవాది విద్యను అభ్యసించారు. చురుకైన యువకుడిగా పేరున్న కృష్ణ చైతన్య ఆదివారం విజయవాడ పట్టణంలోని అత్యున్నత న్యాయస్థానం జడ్జిల సమక్షంలో ఓత్ తీసుకున్నారు.న్యాయవాది వృత్తిలో ప్రవేశిస్తున్న కృష్ణ చైతన్యను పట్టణంలోని న్యాయవాదులు పాత్రికేయులు రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపిస్తూ పేదలకు న్యాయం దక్కే విధంగా కృష్ణ చైతన్య పనిచేయాలని కోరారు.అత్యున్నత ప్రమాణాలు నైతిక విలువలతో న్యాయవాద వృత్తిని నాలుగు దశాబ్దాల నుండి కొనసాగిస్తున్న లాయర్ పి.వి సుబ్బారెడ్డి దగ్గర జూనియర్ గా చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు
కృష్ణ చైతన్య సెల్: 9666116116