!! రియల్టర్ల చూపు ..అమరావతి వైపు !!

⇔జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

 

రాయలసీమ జిల్లాలలోని రియల్ వ్యాపారులు అమరావతివైపు పరుగులు తీస్తున్నారు..అయిదేళ్లనుంచి వైయస్ ఆర్ సిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రియల్ వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడిపోవడమే కాకుండా వేలకోట్లు పెట్టుబడులుపెట్టి అయోమయంలో పడ్డారు..వడ్డీలు చెల్లించలేని పరిస్థితులలో ఉన్నారు..వీరందరూ గత అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి సర్కారు అదికారంలోకి వస్తే తప్ప రియల్ కు జోష్ రాదని భావించి భారీ ఎత్తున ప్రచారంచేయడమే కాకుండా కొంత పెట్టుబడులుకూడాపెట్టి రాయలసీమ జల్లాలలోని 52 నియోజకవర్గాలలో నంద్యాల,కర్నూలు,ఆదోని,ప్రొద్దుటూరు, కడప,తిరుపతి, అనంతపురం,హిందూపురం పట్టణాలతో పాటుగా మరో 20 నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్ధుల గెలుపులో కీలక భూమిక పోషించారు..ప్రస్తుతం ఇక్కడ రియల్ ఊపు అందుకోవడానికి మరో మూడు మాసాలు సమయం పట్టవచ్చని ఆలోపుగా అమరావతికి వందకిలోమీటర్ల దూరంలో పొలాలు కొనుగోలు చేస్తే కనీస నష్టాన్ని పూడ్చుకోవచ్చని అదృష్టం కలిసి వస్తే ఆదాయాన్ని కూడా పొందవచ్చని భావిస్తూ అమరావతివైపు కొనుగోళ్లను ఆరంభించారు..ధైర్యంచేసి కొందరు కౌంటింగ్ కు ముందే కొనుగోలు చేయడంతో వారికి భారీ ఎత్తున కౌటింగు తరువాత ఆదాయం వచ్చిందనే ప్రచారం సాగుతుండటంతో మిగిలిాన వారు కూడా అటువైపే దృష్టిని సారించారు..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకూడా తన అజెండాలో అమరావతికి భారీ ఎత్తున నిధుల కేటాయించి ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చడమే కాకుండా మరో ఐదేళ్ల తరువాత కూడా ఎవరూ రాజధాని మరో ప్రాంతానికి తరలించకుండా అభివృద్ది చేయాలనే తలంపుతో ఉన్నారు.దీనితో ఆరు నూరైనా అమరావతితోపాటు గుంటూరు, తాడికొండ, మంగళగిరి ,గన్నవరం. చల్లపల్లి . నందిగామ,కోర్ క్యాపిటల్ ప్రాంతాల వరకు సి ఆర్ డి ఎ పరిాదిలోని అన్ని ప్రాంతాలలో రియల్ ఊపందుకుంది..అయితే ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్రంలోని అన్ని 26 పార్లమెంటు కేంద్రాలలో కూడా రియల్ భూం అందుకుంటే సబ్ రిజిష్ట్రార్ ల కార్యాలయాల పరిదిలో ఆదాయం పెరిగి మరిన్ని సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టవచ్చని భావిస్తున్నారు…దీంతో ఇక్కడకూడా అభివృద్ది చెందుతుందని మరికొంతమంది స్థానికంగానే కొనుగోళ్లను ఆరంబించారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *