జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
✤ 40 ఏళ్ల చరిత్ర
✤ వన్నె తరగని డిగ్రీ కాలేజీ
✤ రామకృష్ణ రెడ్డి కాలేజీ పై ఉన్న ప్రత్యేక దృష్టి
✤ కంప్యూటర్ కోర్సుల పై మెరిట్ స్టూడెంట్ ల ఆసక్తి
నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన నంద్యాల జిల్లా కేంద్రం లోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో చదువు కోవడానికి ప్రముఖ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదివి 900 నుంచి ఆ పై మార్కులు సాధించిన విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.ఇప్పటికే నంద్యాల తోపాటు కడప జిల్లాలోని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు,అనంతపురం జిల్లాలోని తాడిపత్రి,ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంకు చెందిన ఇంటర్ బాలికలు కళాశాలలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు.కేవలం బోర్డుకు పరిమితం కాకుండా యూనివర్సిటీ నిబంధనలకు అనుగుణంగా కొత్త ల్యాబ్ లు,కంప్యూటర్లు లైబ్రరీలు తో పాటు గ్రౌండ్ లు వంటి వసతులు కల్పించారు.వీటి అన్నిటికి ప్రత్యేక అధ్యాపకులను కూడా మూడు దశాబ్దాల నుంచి కొనసాగిస్తున్నారు.
కోర్సులు
—————
కొత్తగా ఐదు కోర్సులు,రన్నింగ్ లో ఉన్న B.Sc,B.com, BBA కోర్సులు ఉన్నాయి.వీటిలో అత్యధిక వాటికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేవిధంగా కంప్యూటర్ కోర్సులు ఉన్నాయి.మేనేజ్ మెంట్ కోటపైప్రతి గ్రూప్ లో 30 శాతం సీట్లు ఉంటాయి.ఈ సీట్లను యూనివర్సిటీ ఫీజులకు మాత్రమే ఇస్తారు.దీంతో కౌన్సెలింగ్ కోటలో సీట్ ఇదే కాలేజీలో వస్తుందో .. రాదో అనుమానం ఉన్నవారు ఇప్పుడేముందస్తు గా పేర్లు నమోదు చేసుకోమని కోరుతున్నారంటే క్రేజ్ ఏ మాత్రం ఉందో చెప్ప వచ్చు….వంద km దూరం వెళ్లిన ఎటువంటి విద్య వసతులు,పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే డిగ్రీ కాలేజీ లు లేకపోవడంతో ఇక్కడే చేరాలని చూస్తున్నారు..
జాబ్స్ ప్రత్యేక క్రేజు
———————-
రామక్రిష్ణ డిగ్రీ కాలేజీ పై విద్యార్థులు ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం ప్రతి ఏటా కనీసం 200 నుంచి 300 కు పైగా ఉద్యోగాలు రావడం గతంలో చదివిన వారికి కొందరికి నెలకు లక్షలలో జీతాలు తీసుకోవడం, గతంలో చదివిన స్టూడెంట్ లు ఇక్కడే చేరాలని సూచించడం ప్రధాన కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు.