జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
ఎన్నికలసంఘం ఆంద్రప్రదేశ్ లో నాలుగో విడతలో సార్వత్రిక ఎన్నికలు జరుపాలని నిర్ణయించడం ప్రజల అదృష్లంగా భావిస్తున్నారు..నేతలు మాత్రం ఇంత ఆలస్యం ఎందుకని బాదపడుతుండగా ప్రజలు మాత్రం వారి ఆలోచనకు భిన్నంగా సంతోషం వ్యక్తంచేయాల్సిన పరిస్తితి ఏర్పడింది..ప్రధాన కారణం ఏమంటే నీటి ఎద్దడి సమస్య మొదటి పేస్ లో ఎన్నికలు ఉంటే నీటి ఎద్దడిని అంతవరకే పరిష్కరించడానికి చొరవచూపేవారు..ఆతరువాత ప్రజలతో మాకేం పనిఅని 25 పార్లమెంటు నియోజకవర్గాలలోని 175 నియోజకవర్గాలలో అనుకునే వారు..ఇప్పుడు అలాకాకుండా రాష్ట్రంలో కనీసం 80 అసెంబ్లీ నియోజకవర్గాలలోొ ఇప్పటికే నీటి ఎద్దడి ఆరంభం అయ్యింది..42 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిలో ఇంత నీటి ఎద్దడి ఉంటే ఎండలకాలం ముగిసేసరికి ఏ పరిస్థితిా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు ..రాష్ట్రంలోని 25 జిల్లా కేంద్రాలలో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించడానికి అత్యవసర పోను నెంబర్లను కూడా ఇచ్చేశారు..నాలుగో విడత ఏప్రియల్ 18 నుంచి మే 13 వరకు ఎన్నికల సంఘం ప్రచారాన్ని,పోలింగును నిర్వహించాలని నిర్ణయించింది..ఇంతవరకు నీటి ఎద్దడి కొనసాగినా అధికారులు విఫలము అయితే వెంటనే పార్లమెంటు అసెంబ్లీలకు పోటీచేస్తున్న ఇరు పార్టీల అభ్యర్ధులు ప్రజల ఇండ్ల దగ్గరకు నీటిని తరలించే ఏర్పాట్లను చేసే అవకాశాలు ఉన్నాయి..మొత్తం మీద నాలుగో విడతలో ఎన్నికల ఏర్పాట్లను చేయడంపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు…