♦జనాస్త్రం ప్రతినిది మారంరె్డ్డి జనార్ధనరెడ్డి
⇔అభ్యర్థుల పరిచయం అద్భుతం … అమోఘం
⇔తన్మయం చెందిన అభిమానులు
⇔సోదరులుగా రవి, బిజేంద్రలు
⇔మంత్రికి స్నేహితుడిగా కితాబు
⇔భూపాల్, చక్రపాణిలకు అన్నా అంటూ
తమ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేయడంలో వైయస్ఆర్సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తనకు తానే సాటి అని నిరుపించుకున్నారు. గురువారం నంద్యాల పర్యటనకు వచ్చిన జగన్ ఏడు అసెంబ్లీకు చెందిన అభ్యర్థులను ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని ఓటర్లకు పరిచయం చేస్తూ మీ చల్లని దీవెనలు అందిచాలని కోరారు. చివరిలో మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డిని పరిచయంలో జగన్ వారి ఇద్దరి మధ్యన ఉన్న సనిహిత్యాన్ని చెప్పకనే చెప్పారు. అలాగే వయస్సు రీత్య తన కంటే ఎక్కువైనా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని రెండు సార్లు అన్నా అని సంబొధించారు. ఇదే సంబొధనను శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డికి చేశారు. వయస్సులో తక్కువైనా శిల్పా రవి (నంద్యాల), గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి (ఆళ్లగడ్డ)లను సోదరులుగా వివరిస్తూ నందికొట్కూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ధారా సుధీర్ డాక్టర్‌గా మీకందరికి పరిచయమేనని వీరందరికి మీ చల్లని దీవెనలు ఇవ్వాలని వారి అభిమానులు, వైయస్ఆర్సిపి కార్యకర్తలను కోరారు. అన్నా సోదరుడు అంటూ పరిచయం చేయడంతో వారి ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి జగనన్నే మా ధైర్యం… పోగరు అంటూ చెప్పడంతో రవి అభిమానులు కేక పెట్టారు.