జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దన రెడ్డి
#త్వరలో షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం
నంద్యాల పట్టణంలో పేరుమోసిన న్యాయవాది,ప్రముఖ క్రిమినల్ లాయర్ శివారెడ్డి కుమారుడు , వైయస్ ఆర్ సిపి వీరాభిమాని ప్రదీప్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు..నంద్యాల అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ టికెట్టు హామీ పొందడంతోనే ఆయన పార్టీలో చేరనున్నట్లు తెలిసింది..త్వరలోనే పిసిసి అద్యక్షురాలు షర్మిలను నంద్యాలకు ఆహ్వానించి ఆమె సమక్షంలో చేరాలని, లేని పక్షంలో విజయవాడకు వెళ్లి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిలతో కండువా కప్పించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది..వైయస్ రాజశేఖరరెడ్డికి ప్రదీప్ రెడ్డి తల్లి దండ్రులు అత్యంత సన్నిహితంగా కొనసాగేవారని తెలంగాణా ముఖ్యమంత్రి రేవంతరెడ్డి బందువులతో ప్రదీప్ రెడ్డికి సంబందాలు ఉన్నట్లు తెలుస్తోంది..మొత్తం మీద గత ఎన్నికల సమయంలో వైయస్ ఆర్ సిపి విజయం కోసం కృషిచేసిన ప్రదీప్ రెడ్డి గత కొంతకాలంనుండి ఆపార్టీకి దూరంగా ఉండటమే కాకుండా ఇతర పార్టీలతో చనువుగా కొనసాగారు..అయితే ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ డు ఆర్ డై రాజకీయం చేయాలని రంగంలోకి దిగడంతో ప్రదీప్ మెచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు..ఇదిలాఉండగా వ్యవసాయపరిశోధనా కేంద్రం రాష్ట్రం పాలకమండలిసభ్యుడు స్టాండర్డ్ మోహనరెడ్డికి సన్నిహితుడైన ప్రదీప్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే విషయంపై చర్చనీయాంశంగా మారింది