జనాస్త్రం బ్యూరో నెట్ వర్క్
జనాస్త్రంకు జయహో..
janaasthram.com
పదిరోజుల క్రితం ప్రారంభమైన జనాస్త్రం డిజిటల్ మీడియా వెబ్ సైటు కు రోజురోజుకు స్పందన పెరుగుతోంది.. ఇందులో వస్తున్న వార్తలను ప్రజలు పెద్ద సంఖ్యలో చూస్తూ తమ మద్దతును ప్రకటిస్తున్నారు..విజయపధంలో దూసుకువెళ్తున్న జనాస్త్రం మేనేజింగ్ డైరెక్టరు జనార్థన్ రెడ్డిని రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి సన్మానించారు.. సోమవారం ఇండియన్ న్యూస్ పేపర్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పది రోజుల్లో జనాస్త్రంలో వచ్చిన వార్తా కథనాలను 21వేల మంది చూడడం ఎంతో గొప్ప విషయమని చూసిన వారందరికీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో లక్షల్లో వీక్షకులు వస్తారని ఇందుకు సహకారం ప్రతి ఒక్కరూ జనాస్త్రంకు అందించాలని రామకృష్ణా రెడ్డి తన కళాశాల పూర్వ విద్యార్థులను, ప్రస్తుత విద్యార్థులను, ఇతరులను కోరారు. కార్యక్రమానికి హేమంత్ రెడ్డి, ప్రగతి రెడ్డిలతో పాటు పలువురు లెక్చలర్లు హాజరయ్యారు. సన్మాన గ్రహీత జనాస్త్రం మేనేజింగ్ డైరెక్టరు జనార్ధన రెడ్డి మాట్లాడుతూ దమ్ము ఉన్న వార్తలను ప్రజలకు అందించే ఏపత్రికనైనా మీడియానైనా ప్రజలు ఆదరిస్తారనడనికి అనతి కాలంలోనే తాను ప్రారంభించిన వెబ్ సైటుకు ప్రేక్షకులు అందించిన ఆదరణే నిదర్బనమన్నారు..రాబోయే రోజుల్లో ప్రజాసమస్యలకోసం తమ మీడియా అందించే వార్తలను janaasthram.com వెబ్ సైటును సందర్శించి పొందవచ్చన్నారు..ఇదే వెబ్ అడ్రసు ద్వారా జనాస్త్రం యూ ట్యూబ్ చానల్ ఐకాన్ ఓపెన్ చేసి జనాస్త్రం యూ ట్యూబ్ చానల్ ను సైతం వీక్షించే అవకాశం తమ ప్రేక్షకులకు అందించామన్నారు..తాను చేసిన ఈ ప్రయత్నానికి ఎల్ల వేళలా మీ అండదండలు ఉండాలని జనార్ధన రెడ్డి కోరారు..
Post Views: 353
Like this:
Like Loading...