నంద్యాల జర్నలిస్ట్‌లకు సన్మానం..

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

.
నంద్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణ పీజీ సెంటర్‌లో ఇండియన్‌ న్యూస్‌ పేపర్స్‌ డే సందర్భంగా నంద్యాల పట్టణంలోని ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకరులను సన్మానించారు. కార్యక్రమానికి చైర్మన్‌ రామకృష్ణా రెడ్డి అధ్యక్షత వహించగా హేమంత్‌ రెడ్డి, ప్రగతి రెడ్డిలు వేడుకను నిర్వహించారు.

 

భారీ ఎత్తున కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. నిత్య జీవితంలో వార్తలు ఒకభాగమని ఇంట్లో కానీ, కళాశాల లైబ్రరీలో కానీ కొంత సమయం కేటాయించి రోజు విద్యార్థులకు ఇష్టమైన స్పోర్ట్స్‌ సినిమా, బిజినెస్‌, విద్య వార్తలపై సంపూర్ణ అవగాహన తెచ్చుకోవాలని కోరారు. చెడు వార్తలు వస్తున్నాయంటే పత్రికల తప్పిదం కాదని, మనం చేసే తప్పిదాల వల్లే వార్తలు వస్తాయన్నారు. ఈ సందర్భంగా పత్రికా రంగంలో నంద్యాల పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ప్రాణాలకు తెగించి వార్తా కథనాలు వ్రాసిన పాత్రికేయులకు రామకృష్ణా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దశల వారీగా పత్రికా రంగానికి వార్తలు వ్రాసిన పాత్రికేయులను సన్మానం చేస్తామని రామకృష్ణా రెడ్డి వివరించారు. జీఆర్‌కే ఛానల్‌ను సబ్‌ స్క్రబ్‌ చేసుకుంటే అందులో అనేక విషయాలు వస్తాయన్నారు. ఈ సందర్భంగా ప్రింట్‌ మీడియా తరుపున జనాస్త్ర నిర్వాహకుడు మారంరెడ్డి జనార్థన్‌ రెడ్డి, ఎలక్ట్రానిక్‌ మీడియా తరుపున కుమార్‌ (నంది), బాష, హరి (సిటీకేబుల్‌)లను సన్మానించారు. కళాశాల లెక్చరర్లు ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *