జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
#ముద్రగడకు గవర్నర్…?
# పొత్తు వికటిస్తే బీజేపీ బంపర్ ఆఫర్స్..
#బలిజ ఓట్లకోసం బిజెపి గాలం
టీడీపీ జనసేనలతో బీజేపీ పొత్తు కుదిరితే ఎలాంటి సమస్య ఉండదని లేని పక్షంలో బీజేపీ కాపు కుల ఓట్లకు ఆంధ్రప్రదేశ్‌లో గాలం వేయాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల పోటీపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఇదే సమయంలో బీజేపీని పొత్తు కలుపుకోవాలని పవన్ కల్యాణ్ టీడీపీని కోరుతున్నారు. టీడీపీ కూడా బీజేపీతో పొత్తుతో కలిసిపోవాలని భావిస్తుందని రాయలసీమలోని కర్నూలు, కడప, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో అత్యధికంగా ముస్లిం ఓట్లు ఉండడంతో చంద్రబాబు భయపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద బీజేపీకి పొత్తు లేకుంటే అయోధ్య రామమందిరం జోష్‌తో నేరుగా ఎన్నికల బరిలో దిగాలని ఇందుకు కాపు ఓటర్లను దరి చేర్చుకోవాలని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ టీడీపీతో కాకుండా బీజేపీతో కలిసి వస్తే ఆయనకే కాకుండా ఆయన సోదరుడు చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ జనసేన పార్టీల నిర్ణయంగా ప్రకటిస్తామని జనసేనలో చేరుతారని భావిస్తున్న ముద్రగడ పద్మనాభంకు పదవి ఇచ్చి ఆయన కుమారుడికి శాసనసభలో అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతున్నది. తెలంగాణాలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఇక్కడ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ద్వారా బలిజ ఓట్లను రాబట్టుకునే యత్నంలో ఉన్నారు. అయితే బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో ఆ పార్టీ ఇక్కడ వచ్చే ఎన్నికల్లో చురుగ్గా ఉండకపోవచ్చు. ఈ అంశాలను చంద్రబాబు పరిగణలోకి తీసుకొని పొత్తుకు ఓకే అంటారా.. లేని పక్షంలో యుద్ధమే శరణ్యమని అంటారా అనే దానిపై నాలుగైదు రోజుల్లో క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.