జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
* జగజ్జనని దీక్ష
* ఈసారి 15 వేలకు పైగా దీక్షలు
* దీక్షలు అక్టోబర్ 3 నుంచి ఆరంభం
* ఆలయంలో ఉచిత భోజనం,టిఫిన్
నంద్యాల జిల్లా కేంద్రంలో అక్టోబర్ 3వ తేదీ నుండి నిర్వహించే జగజ్జనని మండల దీక్ష వివరాలను ఆలయ నిర్వాహకులు పుల్లయ్య జనాస్త్రం కు వివరించారు.30సంవత్సరాల క్రితం పదుల సంఖ్యలో దీక్షలు స్వీకరించిన వారు, నేడు వేలకు చేరుకున్నారని, రెండు మూడు ఏళ్లలో దీక్షలు స్వీకరించేవారు లక్షలకు చేరుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని భక్తులు పేర్కొంటున్నారు.
దీక్ష రోజులు : 40
దుస్తులు : ఎర్రటివి
దీక్ష తేదీలు : 03-10-2024 నుండి 15-11-2024 వరకు
మాల ధరించే తేదీలు : 03-10-2024 నుండి 07-10-2024 వరకు
అర్థ మండల దీక్షలు : 23-10-2024 నుండి 27-10-2024 వరకు స్వీకరించవచ్చు
పాల్గొనేవారు : స్త్రీలు,పురుషులు,బాల బాలికలు
ఆంక్షలు : నిష్టతో చేయకుంటే లాభం లేదు
గత ఏడాది : 10వేల మంది పైగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు దీక్షను స్వీకరించారు.
ఇప్పుడు : 15 వేల నుండి 20 వేల మంది దీక్ష తీసుకునే అవకాశం
ఆలయంలో అయితే : నంద్యాల జిల్లా కేంద్రంలోని జగజ్జనని ఆలయంలో దీక్ష తీసుకోవచ్చు… విరమించవచ్చు…
భక్తులకు ఉచిత భోజనం టిఫిన్ వసతి కల్పిస్తారు
వివరములకు : 98667271 23