జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
* సమావేశానికి సహకారం అమోఘం
* ఫలించిన శ్రీనిధి రఘువీర్ వ్యూహం
* సమస్యలపై ఏ కరువు పెట్టిన హోటల్స్ అధినేతలు
రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యుల సమావేశం భారీగా విజయవంతం అయింది. నంద్యాల పట్టణంలో శుక్రవారం ప్రముఖ ఎల్ కె ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన 25 జిల్లాల్లోని ప్రధాన హోటల్స్ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనిధి హోటల్ అధినేత రఘువీర్ రాష్ట్ర అసోసియేషన్ లో కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ సమావేశాన్ని రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాల్లో నిర్వహించడానికి అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చినప్పటికీ, నంద్యాల జిల్లా కేంద్రంలో ఈసారి సమావేశం జరిగి తీరాల్సిందే నని రఘువీర్ పట్టుబట్టారు.ఆ మేరకు సమావేశాన్ని నిర్వహించగా 200 మందికి పైగా పేరు మోసిన హోటల్స్ అధినేతలు ఈ సమావేశంలో పాల్గొని హోటల్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర న్యాయశాఖ మంత్రి Nmd ఫరుక్ కు వివరించారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. మంత్రి హామీకి అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
స్విగ్గి జొమోటో లాంటి సంస్థలతో హోటల్స్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని, టాక్స్ లు ఇతర వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గౌరవాధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి,గౌరవ కార్యదర్శి నాగరాజు, కోశాధికారి పూర్ణచందు తదితరులు పేర్కొన్నారు.ప్రతి సభ్యుడు చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వ దృష్టికి కూడా తెస్తామని రఘువీర్ హామీ ఇచ్చారు.మొత్తం మీద పది రోజులకు పైగా రఘువీర్ ఆధ్వర్యంలో హోటల్ అధినేతలను సమావేశానికి హాజరయ్యే విధంగా చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. రఘువీర్ సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన యజమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు అండ మేము, మాకు అండ మీరు అంటూ సత్సంగాన్ని ముగించడంతో హర్షద్వానాలు వ్యక్తమయ్యాయి.