!!మాట‌ల తుటాల‌తో జోష్ నింపిన జ‌…గ‌న్ !!

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

⇔మాట‌ల తుటాల‌తో జోష్ నింపిన జ‌…గ‌న్

⇒చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌ల జోరు

⇔137 సార్లు నేను నొక్కా … మీరు 2 సార్లు చాలు

⇒ప్ర‌సంగం టాప్ అంటూ శ్రేణులు

 

మేమంతా సిద్ధం అంటూ ఎన్నిక‌ల శంఖ‌రావాన్ని పూరించుకుంటూ క‌ర్నూలు జిల్లాకు వ‌చ్చిన వైయ‌స్ఆర్సిపి అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌ను చూడడానికి వ‌చ్చిన అభిమానుల‌ను ప్ర‌జ‌ల‌ను మెప్పించే య‌త్నంలో ఆయ‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. గురువారం ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల శుక్ర‌వారం ఎమ్మిగనూరు త‌దిత‌ర ప్రాంతాల‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌ల్లో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు పై విరుచుకు ప‌డ్డారు. కూట‌మి నాయ‌కుల‌ను కుడా విమ‌ర్శిస్తూ వారి పొత్తుతో పాటు త‌న చెల్లెల‌ను ఇద్ద‌ర్ని కుడా క‌లుపుకొని పోయార‌ని వీరంద‌రి పై యుద్ధం చేసే శ‌క్తి మీ ద్వారా నాకు ఉంద‌ని వివ‌రించ‌డంతో ప్ర‌జ‌లు హ‌ర్ష‌ద్వానాలు వ్య‌క్తం చేశారు. నాకంటే పెద్దోడు ముస‌లాయ‌న, భారీ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబు నాలాగా ఎందుకు ఆలోచించ‌లేక పొయ్యారని ఆయ‌న తిరిగి అధికారంలోకి వ‌స్తే మ‌రో ప‌దేళ్లు వెన‌క్కి రాష్ట్రం వెళ్తుంద‌న్నారు. చంద్ర‌బాబు చేసింది. సున్న అంటూ ప్ర‌త్య‌ర్థుల పై విమర్శలవర్షంకురిపించారు . నేను అభివృద్ధి చేసి ఉంటే ఓటు వేయ‌మ‌ని అడుగుతున్నానని ఇలా ఎందుకు త‌న ప్ర‌త్య‌ర్థి చెప్ప‌డం లేద‌ని ప్ర‌జ‌ల హ‌ర్ష ద్వానాల మధ్య ప్ర‌క‌టించారు. 42 డిగ్రీల వేడిలో కుడా జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని ఆనందంగా ప్ర‌జ‌లు విన్నార‌ని ఎన్నిక‌ల జోస్ నింపారని పాణ్యం, నంద్యాల ఎమ్మెల్యే అభ్య‌ర్థులు కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, ర‌విచంద్ర‌కిషోర్ రెడ్డిలు అన్నారు. త‌న ప్ర‌భుత్వ హ‌యంలో 137 సార్లు బ‌ట‌న్ నొక్కానని రెండు సార్లు మీరు బ‌ట‌న్ నొక్క‌మ‌ని కోరుతున్నాన‌ని ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. వెన్నుపోటు చంద్ర‌బాబును న‌మ్మ‌వ‌ద్దంటూ ప‌దే ప‌దే చెబుతూ కొత్త ట్రెండ్‌ను త‌న ప్ర‌సంగంలో జ‌గ‌న్ కొన‌సాగించి అసెంబ్లీ బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల‌ను సంతోష పెడుతూ ప్ర‌జ‌ల‌ను ఓటు వేసే విధంగా జోస్ నింపార‌ని పార్టీ నాయ‌కులు దేశం సుధాక‌ర్ రెడ్డి త‌దిత‌రులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *