జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
#ఇన్‌ఛార్జి పరిశీలనలో ఆలీ, ఖాదర్ బాషా
#ఖాదర్ బాషా పైనే పార్టీ మొగ్గు
#అందరికి విమ్మయమేవైయస్ఆర్‌సిపి స్థానిక నాయకులకు పార్టీ అధ్యక్షుడు నంద్యాల నేతలకు షాక్‌ల మీద షాక్ ఇస్తున్నారు. దీంతో కార్యకర్తలకు అనుచరులకు ఏం చెప్పాలో పాలుపోని పరిస్థితి ఏడుగురు ఎమ్మెల్యేలలో నెలకొంది. మొదటి నుంచి కుడా నంద్యాల ఎంపీకి కొత్తవారు వస్తారనే చర్చ సాగుతున్నది. నంద్యాల ప్రస్తుత ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డికే టిక్కెట్ ఇస్తారనే ఆలోచన వైసిపి వర్గాల్లో నెలకొంది. అయితే శనివారం అందరికి షాక్ ఇస్తూ సినీ నటుడు ఆలీ, మరో మైనార్టీ నాయకుడు ఖాదర్ బాషా పేర్లు ప్రతిపాధనకు వచ్చాయని సమాచారం అందడంతో కార్యకర్తలు విస్మయానికి గురి అవుతున్నారు. ఆలీకి సినిమా క్రేజ్ మాత్రమే ఉండగా ఖాదర్ బాషాకు 2009 చిత్తూర్ జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవంతో పాటు నంద్యాలలో ఉప ఎన్నికల సందర్భంగా మైనార్టీ ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. వైసిపి రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న ఖాదర్ బాషా నంద్యాల పట్టణంలో గత 5, 6 సంవత్సరాల నుంచి ముస్లీం మైనార్టీతో సంబంధాలు కొనసాగిస్తూ మసీదులకు, మదరసా మరమ్మత్తులకు సొంత డబ్బులను ఇచ్చారు. వీరిద్దరిలో ఏ ఒక్కరిని ఇన్‌ఛార్జి నియమించిన స్థానిక నాయకులకు, పార్లమెంట్ టిక్కెట్ ఆశించేవారికి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. మొత్తం మీద అసంతృప్తి పై జగన్ ఏవిధంగా నీళ్లు చల్లి అనుచుతాడో వేచి చూడాల్సిందే.