పార్టీపట్ల వినయం..విదేయత..విశ్వసనీయత..గుంటుపల్లికి వరం

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

* లోకేష్ పాద యాత్రలో కీరోల్
* ఫరూక్ గెలుపులో కూడా..
* తండ్రి వెంకటేశ్వర్లు నుంచి పార్టీకి అండగా 
* వైసీపీలో ఇక్కట్లు పడ్డారు

వినయం, విధేయత గుంటుపల్లి హరిబాబు కు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మెన్ దక్కిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.దాదాపు 55 ఏళ్ల వయసు ఉన్న హరికి ఈపదవి ఇవ్వడానికి ఎన్నో సమీకరణలు చూసి పార్టీకి వెళ్లిన పేర్లలో హరి పేరు ఎంపిక చేశారు.హరి తండ్రి వెంకటేశ్వర్లు టీడీపీ పుట్టక నుంచి పనిచేస్తూ వచ్చారు.ఆయన మరణించే వరకు పార్టీ లో ఉన్నారు.తండ్రి బాటలోనే తనయుడు హరి కూడా టీడీపీలో ఉంటూ నంద్యాల పట్టణంలోనూ అసెంబ్లీ లోనూ టీడీపీ విజయం కోసం కృషి చేస్తు వస్తున్నారు.2019 నుంచి 2024 వరకు ysrcp అధికారంలో ఉన్న కాలం లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.లక్షలలో ఆర్థికంగా దెబ్బ తిన్నారు.2024 అసెంబ్లీ ఎన్నికల ముందు లోకేష్ వెంట చాలా కి.మీ లు నడిచారు.cm. సామాజిక వర్గానికి చెందిన హరిబాబు రైతునగర్ ప్రాంతానికి లోకేష్ పాదయాత్ర చేరుకున్న వెంటనే పాదయాత్ర గుర్తింపు పలకాన్ని ఏర్పాటు చేశారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హరిబాబు కు రాష్ట్రంలో కాని స్థానికంగా కాని ఏదో ఒక పదవి వస్తుందని అంచనా వేశారు.హరి కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని భావించి మంత్రి ఫరూక్ తో చనువుగా ఉంటూ, పార్టీలో కూడా అధినేతలు చంద్ర బాబునాయుడు,లోకేష్,పళ్ళ శ్రీనివాస్,అచ్చం నాయుడు తదితరులను కలుసుకుంటూ ఆశీస్సులు కోరుతూ వచ్చారు.
మొత్తం మీద 25 ఏళ్ల క్రితం ఫరూక్ మంత్రి గా ఉన్న సమయంలో వెంకట నారాయణ చౌదరి నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మెన్ గా పని చేశారని ఇప్పుడు కమ్మ సోదరులకు ఫరూక అవకాశం ఇచ్చారని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.కులం కానే కాదని రెండు మూడు దశాబ్దాల పాటు పార్టీ కోసం కృషి చేశారని అందులో పార్టీ అధికారంలో ఉన్న లేకున్న పార్టీలో వినయ ,విధేయత లతో కొనసాగరని అందుకే పార్టీ రైతు కుర్చీ లో కూర్చో పెట్టిందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.మొత్తం మీద పట్టుదలతో మార్కెట్ యార్డ్ చైర్మెన్ సాధించిన హరి ని రిటైర్డ్ VRO మోహన్ రెడ్డి,ప్రభాకర్ చౌదరి,తదితరులు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *