♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔సందట్లో సడేమియా
⇔మరో రూ.20 కోట్ల ప్రభుత్వ స్థలాన్ని అక్రమించుకునే యత్నం
నంద్యాల పట్టణంలోని ఎన్‌జిఓ కాలనీలో 2.40 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారనే ఆరోపణలు చల్లరాకముందే మరో రూ.20 కోట్లు చేసే పోచా అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న 2311 సర్వే నెంబర్‌లో అక్రమ రిజిస్ట్రేషన్‌ల కోసం తెర లేపినట్లు గుప్పుమంటున్నది. ఏ ప్రభుత్వం రెండు నెలల తరువాత అధికారంలోకి వస్తుందో తెలియదని ఆ లోపలనే సందట్లో సడేమియా అన్న విధంగా అక్రమార్కులు లేచి కుర్చున్నారు. ఎంత వేగంగా అక్రమాలను తమకు అనూకులం చేసుకుంటే సరిపోతుందని వారు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా 2013 సర్వే నెంబర్ స్థలం ప్రభుత్వానికి చెందిన దానిని అక్రమార్కులు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని వెంటనే ఆపాలంటూ 18వ వార్డు కౌన్సిలర్ దేశం సులోచన ఎమ్మెల్యే శిల్పా రవి దృష్టికి, కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కొత్తగా అక్రమాలను సక్రమం చేసుకోవాలని భావిస్తున్న 2311 సర్వే నెంబర్ కుడా రిజిస్టర్లు కాకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. మొత్తం మీద కోట్లు చేతులు మారుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.జనాస్త్రం ప్రచురిస్తున్న సమాచారం నిజమో అబద్దమో అదికారులు నేతలు కౌన్సిల్ సభ్యులు తేల్చాలి..