!ఇక అగ్గి భరాటే !!

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

⇔ఇక అగ్గిభ‌రాటే

⇔గురువారమే నంద్యాల పుర‌పాల‌క సంఘం స‌మావేశం

⇔త‌గ్గ‌నంటున్న దేశం సులోచ‌న‌

⇔శిల్పా నిర్ణ‌య‌మే శిరోధార్యం అంటున్న ఛైర్మ‌న్

నంద్యాల పుర‌పాల‌క సంఘంలో ఫిబ్ర‌వ‌రి 29వ తేది గురువారం జ‌రిగే పుర‌పాల‌క సంఘం స‌మావేశం వాడివేడిగా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు అంటున్నారు. గురువారం ఉద‌యం స‌మావేశం ఆరంభిచేలోపు మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్ మాబున్నిసా , మాజీ ఛైర్మ‌న్ దేశం సులోచ‌న మ‌ధ్య‌న స‌యోధ్య కుదిర్చితే టీ క‌ప్పులో తుఫానుగా ముగుస్తుంది. లేని ప‌క్షంలో అగ్గిభ‌రాట సినీమాను మైమ‌రిపించే విధంగా ఉంటుంది. గ‌త నెల చివ‌రిలో జ‌రిగిన స‌మావేశంలో దేశం సులోచ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఇంత‌వ‌ర‌కు మున్సిప‌ల్ అధికారుల నుంచి స‌మాధానం రాలేదు. ఆమె కోరిన‌ట్లు శ్వేత ప‌త్రం విడుద‌ల చేయ‌లేదు. దీంతో సులోచ‌న ఆగ్ర‌హాంతో ఉన్నారు. ఛైర్మ‌న్ మాబున్నిసా కుడా తాను ఎలాంటి పొర‌పాటు చేయ‌లేద‌ని ఈ విష‌యాన్ని నీవైనా శిల్పా కుటుంబీల‌కుల దృష్టికి తేవాల‌ని ఎమ్మెల్సీ ఇషాక్ బాషాను కోరిన‌ట్లు తెలుస్తొంది. ఇషాక్ బాషా కుడా స్థానిక అధికార పార్టీ నాయ‌కులైన శిల్పా మోహ‌న్ రెడ్డి, ర‌విచంద్ర‌కిషోర్ రెడ్డిల దృష్టికి తెచ్చిన‌ట్లు స‌మాచారం. అయితే ఇందులో దేశం సులోచ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌కుండా… ఆమె తిరిగి పాత విష‌యాల‌ను ప‌ట్టుబ‌ట్ట‌కుండా  కొత్త ఆరోప‌ణ‌లు చేయ‌కుండా చూడాల‌ని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ఎమ్మెల్యేకు సూచించిన‌ట్లు స‌మాచారం. తెలుగుదేశం నాయ‌కులైన మాజీ మంత్రి ఫ‌రూక్‌, మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిలు కుడా అక్ర‌మాల పై ప‌ట్టుబ‌ట్టాల‌ని స్వ‌ల్ప సంఖ్య‌లో ఉన్న కౌన్సిల‌ర్ల‌కు ఆదేశాలు వేరువేరుగా చేసిన‌ట్లు స‌మాచారం. ఇది ఇలా ఉండ‌గా వ్య‌క్తి గ‌త ప‌నులు ఉన్న‌ప్ప‌టికి స‌మావేశానికి వెళ్లి అ త‌రువాత‌నే త‌న ప‌నులు చూసుకోవాల‌ని దేశం సులోచ‌న ఉన్న‌ట్లు స‌మాచారం. మొత్తం మీద ఏం జ‌రుగుతుందో కానీ ఇద్దరూ పంతంతోనే ఉండ‌డంతో స‌మావేశం ర‌సాబ‌సాగా మారే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *