♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
♣సభలు స్టార్ట్ కాక ముందే హిట్… కాదు కాదు ఫట్
♣సొంత మీడియాలతో ప్రచారం పై విషం కక్కే కుట్రలు
♣ఫరూక్, శిల్పాలు తమ సోషల్ మీడియాకు డైరెక్షన్
♣మీడియా మాత్రం ఉన్నది ఉన్నట్లు చూపుతున్నారు
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి, తెలుగుదేశం పార్టీల అభ్యర్థుల అనుచరులు వేగంగా ప్రత్యర్ధిని డ్యామేజ్ చేయడానికి టీమును ఏర్పాటు చేసుకున్నారా… అనే అనుమానం పలువురిలో వ్యక్తం అవుతున్నది. ఏ సభను కుడా విజయవంతం అయ్యిందని ప్రజలు చర్చించుకునే అవకాశం రాకుండా ఏర్పాట్లను చేసుకున్నట్లు తెలుస్తొంది. ఇందుకోసం పెద్ద ఎత్తున సోషల్ మీడియా టీములను ఏర్పాటు చేసి ప్రత్యర్థుల సభలు, సమావేశాల దగ్గరికి వెళ్లి ఈ విధ్వంస కార్యక్రమాలను జరుపుతున్నట్లు తెలుస్తొంది. వాస్తవంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, టిడిపి అభ్యర్థి ఫరూక్‌లు పెద్ద సంఖ్యలో జనాలను సమీకరించుకొని ఊరేగింపులు సభలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సమయాలను బట్టి అల్పహారాలు, భోజనాలు కుడా ఏర్పాటు చేస్తున్నారు. చివరికి అభిమానూలు నిర్వహించే మోటర్ సైకిళ్ల ర్యాలీలకు కుడా పెట్రోల్‌ను అందిస్తున్నారు. ఇంతవరకు ఇరు పార్టీల వారిని ఎవరు ప్రశ్నించరు. సభలు, సమావేశాలు సమయానికి ముందే టీములు వెళ్లి ఖాళీ కుర్చీల ఫోటోలు, వీడియోలు తీసుకొని అప్పటికప్పుడే సమావేశం సభ అట్టర్ ఫ్లాప్ అంటూ ప్రజలకు పొస్టింగ్‌లు కొందరు పంపుతున్నట్లు తెలుస్తొంది. సమావేశం ముగిసిన తరువాత ఇళ్లకు వెళ్తుంటే నాయకుడి తీరు నచ్చక ,సభ ముగియక ముందే బయటకి వెళ్లి పోతున్నట్లు సొంత సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నది. దీంతో పట్టణంలోని ప్రజలకు వేగంగా ప్రత్యర్థి పార్టీ పై దుమ్మెత్తిపోసే ఫ్లాన్‌ను రూపొందించుకుంటున్నారు. నేతలు మాత్రం ఎలాంటి ప్రచారం చేసుకున్న తమ సభలు, సమావేశాలు తమకు నచ్చే విధంగా జరుపుకోవాలని, ఫరూక్, రవిలు నిర్ణయించుకుని ప్రత్యర్థుల పై విషం చల్లే విషయంలో పునఃరాలోచించుకోవాలని తటస్థులు కోరుతున్నారు. జర్నలిజం విలువలతో పనిచేస్తున్న సోషల్ మీడియా, ప్రసార మధ్యమాలు మాత్రం ఇటువంటి కుట్రలకు లోంగకుండా ఉన్నది ఉన్నట్లు చూపుతున్నారు. ఇలాంటి పాత్రికేయులకు అభినందల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు
చాలా మంచి మెసేజ్ సార్,మీ లాంటి సీనియర్ ఇలాంటి వార్తలు ఇంకా చాలా రాయాలి ?