♦జనాస్థ్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔కలెక్టరు,జెసిల ఆధ్వర్యంలో నామినేషన్ పత్రాల పరిశీలన
నంద్యాల పార్లమెంటు, అసెంబ్లీకి పోటీచేస్తున్న అభ్యర్ధుల నామినేషన్ పత్రాల పరిశీలన జిల్లా కలెక్టరు శ్రీనివాసులు, జెసి రాహుల్ కుమార్ రెడ్డి లు శుక్రవారం పరిశీలించారు..వైసిపి,టిడిపి, ఇండిపెండెంట్ అబ్యర్ధులు తమ ప్రత్యర్ధుల నామినేషన్లలోపాలను వివరించారు.నంద్యాల అసెంబ్లీకి వైసిపి అభ్యర్దిగాపోటీచేస్తున్న శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి నామినేషన్ పత్రాలలో వాస్తవాలు దాచిపెట్టారనిా ఇండిపెండెంట్ అభ్యర్ధి కె.విష్ణు వర్ధనరెడ్డి చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి…కొద్దిసేపు ఉత్కంఠత కూడా నెలకొంది..చివరికి ప్రదాన రాజకీయపార్టీల అభ్యర్ధుల నామినేషన్లతో పాటు ఇండిపెండెంటు అభ్యర్ధుల నామినేషన్లను కూడా అత్యదికంగా ఎన్నికల అదికారులు ఆమోదించారు..కొన్నింటిని మాత్రమే తిరస్కిరించారు…