♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔జగన్ పథకాలే శ్రీరామరక్ష
⇔శిల్పా సహకార్ సేవలు కూడా ప్రచారంలో
⇔వార్డునుంచి స్వచ్చందంగా మహిళలు
2029లో నంద్యాల అభ్యర్థిగా భావిస్తున్న శిల్పా నాగిని రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు తన భర్త శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికలకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ తెప్పించేయత్నంలో భాగంగా వార్డుకు 300 నుండి 500 మంది మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చే ఏర్పాట్లను చేసుకొని వారి ద్వారా ప్రచారం చేస్తున్నారు ఐదేళ్లలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ శిల్పా సహకార అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు నంద్యాల నియోజకవర్గంలో మహిళలు అధికంగా వుండడంతో 2029లో నాగిని రెడ్డి వైఎస్ఆర్సిపి తరఫున అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు మొత్తం మీద పోలింగ్ ముగిసే లోపల అన్ని వార్డులలో ఉదయం సాయంత్రం తిరిగి భారీ మెజార్టీ కోసం నాగిని రెడ్డి చేసే ప్రయత్నాన్ని ఆ పార్టీ నాయకులు అభినందిస్తున్నారు