♦జనాస్త్రంప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔దేశం నేతగా పరిచయం కాబోతున్న శ్యాం
⇔ఈనెల 28న నంద్యాలలో బహిరంగసభ
⇔బైరెడ్డి, ఎన్ ఎండి ,భూమా ,ఎవిలకు ఆహ్వానం
మూడు సంవత్సరాల క్రితం కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం సాధించిన ఖండే శ్యాంసుందర్ లాల్ ఏప్రిల్ 28వ తేదీన మరో సంచలనంకు కేంద్ర బిందువుగా నిలిచేయత్నం లో ఉన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ గా స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతున్న శ్యామ్ తన అనుచరులతో పది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అగ్రనేత లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. అప్పటినుండి తెలుగుదేశం నాయకుని హోదాలో నంద్యాల ప్రజలకు పరిచయం కాలేదు. ఈనెల 28వ తేదీన బాలాజీ కాంప్లెక్స్ లో ఉదయం 10 గంటలకు భారీ బహిరంగ సభను నిర్వహించి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు బైరెడ్డి శబరి, ఎన్ఎండి ఫరూక్ ల సమక్షంలో ప్రజలకు పరిచయం కాబోతున్నారు.. ఈ కార్యక్రమానికి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు శబరి, ఫరూక్ లతోపాటు మాజీ ఎమ్మెల్యేలు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి ,విత్తనాబి వృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి లతో పాటు పలువురు నాయకులను ఆహ్వానించారు .చంద్రబాబు లోకేష్ లు నంద్యాలలో నిర్వహించిన సభలకు హాజరైన జనంతో పోటీపడే విధంగా సభను శ్యాంసుందర్ లాల్ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు