జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
———-
నంద్యాలకు చెందిన 3 ఏండ్ల బుడతడు పట విజ్ఞానం లో ప్రపంచ రికార్డు సృష్టించాడు.
వివరాల్లోకి వెళితే నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ కు చెందిన సేవల శివ, స్వప్నిక ల కుమారుడు అయిన 3 ఏండ్ల మోక్ష అయాన్ ఇటీవల హైదరాబాద్ లో నోబెల్ వరల్డ్ రికార్డ్స్ వారి సమక్షంలో.. భారతదేశ చిత్ర పటాన్ని అన్ని రాష్ట్రాల పేర్ల తో పాటు కేవలం1 నిమిషం 55 సెకండ్ల లో పూర్తి చేసి ఈ రికార్డు నెలకొల్పాడు. ఇంకో ఘనత ఏమంటే చిత్ర పటం పై రాష్ట్రాల లేబల్స్ కూడా లేకుండా గుర్తించి ఆశ్చర్యం లో ముంచేత్తాడు.ప్రపంచంలో నే ఇది వేగవంతమైన రికార్డు అని గుర్తిస్తూ నోబెల్ వరల్డ్ రికార్డు రిజిస్ట్రీ వారు ఈ బుడతడికి పతకాన్ని బహుకరించారు.
కాగా ఇదే బుడతడు 2023 లో కేవలం ఏడాదిన్నర వయసు లోనే పజిల్ పరిష్కారం విభాగం లో ఇండియా బుక్ అఫ్ వరల్డ్ రికార్డు లో కూడా చోటు చేసుకున్నాడు