♦జనాస్త్రం ప్రతినిధి మారంరెడ్డి జనార్దన రెడ్డి
⇔జగన్ సభకు మైండ్ బ్లాక్ కావాల్సిందే
⇔భారీగా స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రయత్నాలు
⇔నంద్యాల నుంచే 80 వేల నుంచి లక్ష మంది సమీకరణ
⇔అసెంబ్లీల నుంచి కుడా ఇదే సంఖ్యలో
⇔ఎన్నికల నియమావళికి అనుగునంగా
నంద్యాలలో ఈనెల 28వ తేది జగనన్న బస్సుయాత్ర బహిరంగ సభను విజయవంతం చేయడానికి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి భారీ ఎత్తున జనాన్ని స్వచ్ఛందంగా తరలించడానికి ప్రయత్నాలను ఆరంభించారు. ఆయనతో పాటు ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె, పాణ్యం, నందికొట్కూర్, శ్రీశైలం నియోజకవర్గాల అభ్యర్థులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డా.సుధీర్, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రామిరెడ్డిలు కుడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ప్రొద్దుటూరు తరువాత నంద్యాల సభను వేదికగా చేసుకున్నారు. ఇచ్చాపురంతో ఈ యాత్ర ముగుస్తుంది. అయితే అత్యధిక జనం ఇక్కడే కావాలని లక్ష్యంతో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డితో ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మైనార్టీలు దాదాపు 2 లక్షల 50 వేల నుంచి 3 లక్షల వరకు ఓటర్లు ఉండడంతో నంద్యాల సభకు హాజరయ్యే జనంలో సగం మంది మైనార్టీలు ఉండాలని భావిస్తున్నారు. నంద్యాల పట్టణంలో అత్యధికంగా మైనార్టీలకు పదవులు ఇవ్వడంతో వారు భారీ ఎత్తున ముస్లీం మైనార్టీలను సభకు స్వచ్ఛందంగా తీసుకొని రావాలని నిర్ణయించారు. మొత్తం మీద ప్రత్యర్థుల మైండ్‌ను బ్లాక్ అయ్యే విధంగా జనాన్ని తరలించి ఎన్నికల శంఖారావానికి జగన్ వెంట వీరు కుడా పూరించాలని నిర్ణయించారు.
వేదిక : నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల
సమయం : సాయంత్రం 3:00 గంటల నుంచి
తేది : 28-03-2024
జనసమీకరణ : లక్ష 70 వేల నుంచి 2 లక్షలు
నంద్యాల అసెంబ్లీ నుంచి 70 వేల నుంచి లక్ష వరకు
ఆరు అసెంబ్లీల నుంచి 80 వేల వరకు జనాలు
నిబంధనలు: ఎన్నికల సంఘం రూల్స్‌ను పాటిస్తూ