♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డిజనార్ధన రెడ్డి
♠ ఆశీర్వదీస్తావో … అనుగ్రహిస్తావో… ఆగ్రహాం చెందుతావో
♠ మేమైతే టిడిపిలో ఇమడలేమ్
♠ మాకు స్వేచ్ఛ ఇవ్వు
♠ మాదావ మేము చూసుకుంటాం
♠ భూమాకు అనుచరుల అండ
జరిగిపోయింది సరే… జరగబోయేది నిర్ణయించుకుందాం అని టిడిపి నాయకుడు, మాజీ ఎమ్మల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆయన అనుచరులు 24 గంటల నుంచి చర్చలు జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఫరూక్ కి ఇవ్వడంతో భూమా అనుచరులు అగ్గిమీద గుగిలం అవుతున్నారు. పార్టీ ఏం చెప్పినా అది చేస్తు వస్తున్నాం. 5, 6 నెలల క్రితమే మాకు టిక్కెట్ ఇస్తారో లేదో తేల్చండి అని చంద్రబాబును, లోకేష్‌ను స్వయంగా అడిగి చూసాం చివరికి ఇలా చేశారేంటి అంటూ పార్టీ అగ్రనేతల పై అనుచరులు నిప్పులు చేరుగుతున్నారు. బ్రహ్మాం వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్న ఒప్పుకోవడం లేదు. నిన్ను నమ్ముకొని పార్టీలో కష్టమో, నష్టమో భరిస్తూ వస్తున్నాం. వైసిపి నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. వాటిని కుడా తాగ్యం చేసి నీవు నమ్ముకున్న టిడిపిలో మేము నడిచాం. ఇంకా నడిచే ఓపిక నీకు ఉండవచ్చు … మాకు లేదన్న … శత్రువైనా వైసిపిలోకి వెళ్లి నీకు జరిగిన అన్యాయం పై పగ తీర్చుకొనే ప్రయత్నం చేస్తాం. నీకు మాయ మాటలు చెప్పి టిడిపి వెంట తిరుగమని చెప్పవచ్చు… ఇప్పటి వరకు నువ్వు నమ్మినావ్ మేము నిన్ను నమ్ముతాం కానీ నువ్వు ఇదే పార్టీలో కొనసాగితే మేముండం. 2, 3 రోజుల్లో మాకు ఎదోకటి తేల్చు ..ఇప్పటికే ఫరూక్ వర్గం నీ దగ్గర ఉన్నందుకు మంటలు కొడుతున్నారు. వైసిపివారి కంటే మమల్నే శత్రువులుగా చూస్తున్నారు. నీవు ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన నీ ప్రాణాలను మా ప్రాణాలుగా చూసుకుంటాం. నీవే ఏ నిర్ణయం తీసుకుంటావో, నీ ఇష్టం మాకు నచ్చితే నీవెంటే ఉంటాం. లేకుంటే నీ మీద ప్రేమను కొనసాగిస్తూ ప్రత్యర్థి శిబిరానికి చేరుకొని పగను తీర్చుకొనే యత్నం చేస్తాం. ఆశీర్వదీస్తావో … అనుగ్రహిస్తావో… ఆగ్రహాం చెందుతావో నీవే నంటున్నారు భూమా బ్రహ్మన్న కార్యకర్తలు