♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
⇔గరిష్టంగా 50 బస్లాలు..కనిష్టంగా 40 బస్తాలు
⇔అగ్గితెగులు నివారణకు అద్బుతమైన వరి వంగడం
⇔విత్తనం సృష్టికర్త రవికుమార్
సాగునీటి క్రింద వరి పంట సాగు చేసే వారికి MTU 1271 రకం అద్భుతమైన దిగుబడులు ఇస్తుందని ఈ విత్తనం సృష్టికర్త నంద్యాల RARS సైంటిస్ట్ రవికుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన జనవాస్త్రంతో మాట్లాడుతూ 50 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని దోమ అగ్గి తెగులుకు తట్టుకుంటుందని అన్నారు మార్కెటింగ్ చేసుకుంటే రైతుకు మంచి దిగుబడితో పాటు స్వల్ప పెట్టుబడి మాత్రమే వస్తుందని అన్నారు పంట చేతికి వచ్చే సమయంలో వర్షం రాకుంటే 75 కేజీల బస్తాలు 40నుండి 50 వరకు వస్తాయని తెలిపారు ఈ రకం విత్తనం మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఎన్జీరంగా యూనివర్సిటీ ప్రోత్సాహంతో మార్టేరు రీసర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలతో కలిసి ఈ రకం విత్తనాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు