♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔టిడిపిలో తులసిరెడ్డి ఆద్వర్యంలో భారీ చేరికలు
⇔ఈసికి పిర్యాదుల్లో కూడా టాప్
⇔చక్రం తిప్పుతున్న తులసి
కసితో పగతో ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతల్లో ప్రముఖ న్యాయవాది తాతి రెడ్డి తులసి రెడ్డి ఒకరు .నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు దశాబ్దాలకు పైగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి శిబిరంలో చక్రం తిప్పిన తులసి రెడ్డికి శిల్పా కుటుంబంతో రాజకీయ విభేదాలు తలెత్తడంతో ఆ కుటుంబానికి దూరం కావడమే కాకుండా వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరారు నంద్యాల అసెంబ్లీ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఫరూక్ విజయం కోసం అద్భుతమైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. అవసరమైనప్పుడు విలేకరుల సమావేశాలు పెట్టి శిల్పా పై విరుచుకుపడుతున్నారు. ఒకవైపు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శిబిరంలో అసంతృప్తిగా కొనసాగుతున్న కార్యకర్తలను నాయకులను ఫరూక్ వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు .అంతేకాక ఎన్నికల నిబంధలను ఉల్లంఘిస్తున్నారని శిల్పతోపాటు ఆయన అనుచరులపై ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేస్తున్నారు. మొత్తంమీద ఫరూక్ గెలుపు కోసం పది మందికి పైగా సీరియస్ గా పని చేస్తుంటే మొదటి స్థానంలో తులసి రెడ్డి నిలిచారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు .నంద్యాల పట్టణంలోని 42 వార్డులతో పాటు నంద్యాల, గోస్పాడు మండలాల్లోని అన్ని గ్రామాల్లో పరిచయాలు ఉన్న తులసిరెడ్డి టిడిపిలో చేరడం ఆ పార్టీ నాయకులకు వరంగా మారారని అంటున్నారు