♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔అన్నో ….. నామినేషన్ల వరకే నీకు గడువు
⇔ఆ తరువాత నచ్చకుంటే ప్రత్యర్థి వెంట
⇔ముచ్చమటలు పొయిస్తున్న అసంతృప్తులు
⇔ఇదేమి డిమాండ్ రా బాబోయ్
⇔పోటీ లేకున్న బాగుంటుంది
అన్నో మా నాయకుడు నన్ను పట్టించుకోవడం లేదు … మీరు అసంతృప్తిని మీడియా ద్వారా వ్యక్తం చేస్తే మా దగ్గరికి రానన్నా వస్తారు… లేదా ప్రత్యర్థులైనా మంతనాలు జరుపుతారు. చాల కష్టాల్లో ఉన్నాం … గడ్డన పడతం అంటూ వైసిపి, టిడిపిలోని నాయకులు కొందరూ నంద్యాల పట్టణంలోని మీడియా సంస్థలకు ఫోన్ చేసి వేడుకుంటున్నారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తమను సంపూర్ణంగా వాడుకున్నారు. పైసా ఆదాయం రాకపోవడంతో భారీ నష్టపోయాము … ఇప్పుడేమో మా కంటే బలహీనులతో చర్చలు జరుపుతూ వారికి డబ్బులు ఇస్తూ మెడలో పార్టీ కండువలు వేసి వెంట తిప్పుకుంటున్నారు. మేమెమో చిల్లిగవ్వలేక తిరుగుతున్నాం. పార్టీ నాయకులు జగన్ మోహన్, చంద్రబాబు నాయుడు నంద్యాల ప్రాంతంలో పర్యటించే సమయంలో మా మొరను వినిపిస్తే మా నాయకులు మమ్ములను పట్టించుకుంటారు. లేకుంటే మా గతి అదోగతి అయ్యిందని మీడియాకు ఫోన్ చేసి వివరిస్తున్నారు. మీడియాలో వాస్తవాలు తెలుసుకొని రాస్తామని పాత్రికేయులు చెబుతుంటే ఆలస్యం అవుతుందని వారే సొంతంగా అసంతృప్తి మ్యాటర్‌ను వాట్సాప్‌లో పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు. వీరిలో కొందరూ నిజంగానే అసంతృప్తికి గురైన వారు కుడా ఉండడం గమనర్హం. అయితే పార్టీ అధ్యక్షుల నుంచి చివాట్లు పడతాయని మీడియాలో వచ్చిన వార్తలకు స్పందించి అభ్యర్థలకు తమ అనుచరులను అసంతృప్తి నేతల దగ్గరికి వెళ్లి బుజ్జగింపు పర్వాలు కొనసాగిస్తున్నారు. నామినేషన్ వరకు గడువు ఇస్తున్నాం… ఆ తరువాత మమ్ములను సంతృప్తి పరచకుంటే ప్రత్యర్థి వెంట వెళ్తామని అని వివరిస్తుండడంతో అభ్యర్థులకు ముచ్చమటలు పడుతున్నాయి. నంద్యాల అసెంబ్లీలోనే కాకుండా పార్లమెంట్ లోని అన్ని అసెంబ్లీలలో కుడా అసంతృప్తిపరులు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.