♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔సమయం ఉంది మిత్రమా
⇔బ(క)స్సు యాత్ర
⇔28న నంద్యాలకు రాక
⇔అసెంబ్లీలోని బలమైనా నాయకులు మన వెంటే ఉండాలి
⇔మన ప్రభుత్వ లబ్ధిదారులు కుడా …
⇔అసంతృప్తికి నో ఛాన్స్
⇔అత్యధిక నివేదికలతో రాక
సమయం ఉంది … సర్దుబాటు చేసుకొండని కర్నూలు, నంద్యాల జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయబోతున్నారు. నంద్యాలకు ఈనెల 28వ తేది వస్తున్న వైయస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి యాత్ర అధికార పార్టీ అసెంబ్లీ అభ్యర్థులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈనెల 28వ తేదిన బస్సు యాత్రలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి నంద్యాలకు వస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి (పాణ్యం), శిల్పా చక్రపాణి రెడ్డి (శ్రీశైలం), బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్), గంగుల బిజేంద్ర నాథ్ రెడ్డి (ఆళ్లగడ్డ), శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి (నంద్యాల), డాక్టర్ ధారా సుధీర్ (నందికొట్కూర్)లతో వన్ టూ వన్ మాట్లాడి పార్టీ లోటుపాట్లను తీవ్రస్థాయిలో చర్చించే అవకాశం ఉంది. ఇందుకు ఈనెల 29వ తేదిన కర్నూలు పట్టణాన్ని వేదికగా చేసుకొబోతున్నారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ అభ్యర్థితో కుడా చర్చించనున్నారు. ఒక్కొక అసెంబ్లీ నుంచి 50 మంది కార్యకర్తలను కుడా ఈ సమావేశానికి తీసుకొని రావాలని ఆదేశించినట్లు సమాచారం. ఈనెల 28వ తేదిన ఉదయం ఆళ్లగడ్డ పట్టణంలో కడప జిల్లాకు చెందిన వైసిపి అభ్యర్థులు వారి వెంట వచ్చే 500 మంది కార్యకర్తలతో చర్చించనున్నారు. ఐప్యాక్‌తో పాటు మరికొన్ని సర్వే సంస్థల నుంచి మైక్రో లెవల్‌లో సమాచారం తీసుకొని జగన్ వస్తున్నారు. ఎవరి బలహీనతలు ఎక్కడున్నాయో వారికి వివరించి సమయం అధికంగా ఉందని ఆ లోపల పరిష్కరించి వారి మద్దతు పొందే విధంగా ప్రయత్నాలు చేయాలని కోరారు. తాను చెప్పిన అంశాలను సీరియస్ తీసుకొని పరిష్కరించారా లేదా అనే అంశంపై మరోసారి సర్వే చేయిస్తామని అందువల్ల ఈ 40 రోజులు పార్టీ నుంచి వచ్చే ఆదేశాలను సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. చిన్న నాయకుడైనా సరే వారిలో ఉన్న అసంతృప్తిని తొలగించి పార్టీకి వినియోగించుకోవాలని ప్రతి నియోజకవర్గంలో 50 శాతం ఓటర్లు తమ వైపు ఉండే విధంగా చూసుకోవాలని కోరారు.
అసెంబ్లీల వారిగా లబ్దిదారులు ఇలా
అంతేకాక ప్రభుత్వ పథకాలను పొందిన వారు శ్రీశైలం నియోజకవర్గంలో 75 వేలకు పైగా ఉన్నారని, ఆళ్లగడ్డ లో జిల్లాలోనే అత్యధికంగా 94 వేల మంది, నంద్యాలలో 92 వేలమంది, బనగానపల్లె 91 వేల మంది, నందికొట్కూర్, డోన్ నియోజకవర్గాల్లో ఒక్కొక నియోజకవర్గంలో 86 వేలమందికి పైగా పాణ్యంకు సంబంధించి నంద్యాల జిల్లాలో గడివేముల, పాణ్యం మండలాల్లో దాదాపు 30 వేల మంది లబ్ధిదారులు ఉన్నారని లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయని వారందరిని పదే పదే పలకరిస్తూ వైసిపికి ఓటు వేయాలని గుర్తు చేయాలని కోరనున్నారు.
బలవంతులను దూరం చేసుకొవద్దు
తమ పార్టీలో ఓట్ల బలం ఉన్న నాయకులను ప్రత్యర్థులు లాగేసుకొకుండా చూస్తూ ప్రత్యర్థుల శిబిరాల్లో ఉండే బలమైనా నేతలను తమ వైపు తిప్పుకోవడానికి చూసుకోవాలని కోరారు. ఈ మేరకు కొన్ని పేర్ల జాబితాలను అభ్యర్థులకు అందజేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. పొలింగ్ రోజు ముందుగా వైయస్ఆర్సిపి అభిమానూలను ఓటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని నా వెంట మీరు అసెంబ్లీలో ఆడుగు పెట్టాలంటే నేను గానీ, పార్టీ గానీ చెప్పిన సూచనలు సలహాలు సీరియస్‌గా తీసుకోవాలని దశ దిశ చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద జగన్ రాక ప్రజలకు, ఫ్యాన్స్‌కు ఆనందంగా ఉండవచ్చని అభ్యర్థులకు మాత్రం ముచ్చమటలు పోయిస్తున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.