ఫరూఖ్ పై బైరెడ్డి ప్రశంసల వర్షం..

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

బైరెడ్డి కూడా అద్బుతమైన రాజకీయనాయకుడు

నాకూతురు ప్రతిరోజు మంత్రితో మాట్లాడతారు

పరూఖ్ జాతీయ రాజకీయాలలోకి వెళ్లి ఉంటే చక్రం తిప్పేవాడు

చిల్లరదొంగలను దూరంపెట్టాల్సిందే

రాష్ట్ర మైనారిటీ మంత్రి ఎన్ ఎండి పరూఖ్ కొన్ని అవకాశాలు జారవిడుచుకున్నారని లేని పక్షంలో రాష్ట్ర మంత్రిగా కాకుండా మైనారిటీ కోటాలో కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం వచ్చేదని మాజీ ఎంఎల్ఎ బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రశంసల వర్షం పరూఖ్ పై కురిపించారు..శనివారం నంద్యాల పట్టణంలో జరిగిన సుమన్ టివి నంద్యాలజిల్లా కార్యాలయం ప్రారంభోత్సవ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఇప్పుడు చంద్రబాబునాయుడు చక్కదిద్దే కార్యక్రమంలో ఉన్నారని విజయం కూడా బాబు సాధిస్తారని బైరెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు..అనంతరం మాజీ ఎంపి దివంగత నేత భూమా నాగిరెడ్డి పార్లమెంటుకు మొదటిసారి పోటీచేసే అవకాశం దక్కిన సమయంలో పరూఖ్ పేరుకూడా ప్రస్తావనకు వచ్చిందన్నారు..పరూఖ్ ఆరోజు అంగీకరించి ఉంటే చంద్రబాబు ఆశీస్సులతో కేంద్రమంత్రియేమి మైనారిటీ కోటా కింద ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అవకాశాలు వచ్చేవని అన్నారు..గత అసెంబ్లీ ఎన్నికలలో నంద్యాల నుంచి పోటీచేస్తున్న పరూఖ్ పై భిన్నాభి ప్రాయాలు వ్యక్తం అయ్యాయని నేను మాత్రం ఖచ్చితంగా గెలుస్తున్నాడు …మంత్రి కాబోతున్నాడని చెప్పానని బైరెడ్డి అన్నారు..ప్రమాదం జరిగిన కొన్ని గంటలకే కోలుకోవడమే కాక నష్టపోయిన రైతుకు సహాయం కూడా చేశాడని అంతటి గొప్ప మనసున్న పరూఖ్ భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేపడుతాడని పరూఖ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.నాకుూతురు బైరెడ్డి శబరి నాతో కొన్ని విషయాలు మాట్లాడదని,పరూఖ్ తో రోజూ మాట్లాడుతుందని ఇది ఎంపి,మంత్రి మద్యన ఉన్న అభిమానమని బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు..కొందరు చిల్లర దొంగలను దూరంపెట్టాల్సిన పరిస్థితి సిఎందగ్గరనుంచి మంత్రి పరూఖ్ వరకు ఉందన్నారు…అనంతరం పరూఖ్ కూడా బైరెడ్డిపై ప్రశంసలు కురిపించడమే కాకుండా నాకు నాగిరెడ్డికి, మద్యన విభేదాలు తలెత్తినప్పుడు సర్దిచెప్పే బైరెడ్డి ఎన్నో పోరాటాలు జరిపి రాయలసీమ నీటిపారుదల ఇతర సమస్యలపై పట్టు సంపాదించాడన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *