జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
సుమన్ టివి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ బ్రాంచి ఉన్నా ఆ బ్రాంచిల కంటే నంద్యాల బ్రాంచి మొదటి స్థానంలో నిలవాలని రాష్ట్ర మైనారిటీ మంత్రి ఎన్ ఎండి పరూఖ్,మాజీ ఎంఎల్ఎ బైరెడ్డి రాజశేఖరరెడ్డి, రాష్ట్ర తెలుగు యువత నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కోరారు..నంద్యాల పట్టణంలోని జిల్లా కలెక్టరు కార్యాలయానికి అతి సమీపంలో శనివారం ఎస్ టివి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు..సుమన్ టివి ఇంచార్జి మహబుబ్ భాషా ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల ఇంచార్జి నగరూరు రాఘవేంద్ర, పొలిటికల్ జర్నలిస్టు నాగరాజు, ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బిజెపి నంద్యాలజిల్లా అద్యక్షుడు అభిరుచి మధు, ఎక్సయిజ్ ఈఎస్ రవికుమార్, సుమన్ టివి కర్నూలు ఇంచార్చి కిరణ్,నందకిశోర్, రచయిత కాశీపురం ప్రభాకరరెడ్డి, ఎపియు డబ్ల్యు జె రాష్ట్ర నాయకులు కండే శ్యాం సుందర్ లాల్ ,చలంబాబు, శోభా హోటల్ అధినేత రాఘవేంద్ర, జిమ్ అధినేత కృష్ణ చైతన్య, డాక్టర్ రవి,నరహరి విశ్వనాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు..ఈసందర్బంగా సుమన్ టివి నూతన టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయి వార్తలను సైతం అద్బుతంగా చూపుతున్నదని నంద్యాల జిల్లాలోని ప్రతి అంశాన్ని కవర్ చేసి జిల్లా ప్రజల హృదయాన్ని చూరగొనాలని కోరారు..నెంబర్ 1 స్థానం దక్కేవరకు పోరాటం చేయాలని కోరారు..ఎలాంటి ఆహ్వానాలు ఇవ్వకపోయినప్పటికి సుమన్ ప్యాన్స్ గా తాము హాజరు అయ్యామని ఇంచార్జి మహబుబ్ బాషాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ తమవంతు సహకారం అందిస్తామని భాషాకు హామీ ఇచ్చారు..