♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
⇒యేటా 3 లక్షల మందికి అన్నదానం..రూ.3 కోట్ల ఖర్చు
⇒రైతులు విరాళం అధికమే
⇒స్వచ్చందగం సేవకులు
⇒ప్రచారం నిల్..నిదానంగానే కార్యక్రమాలు
రోజుకు 8సత్రాలలో 10వేల మంది కి ఉచితంగా భోజనం,టిఫెన్ పెడుతున్నారంటే ఆయన పవర్ ఎంటి అంటూ 10వేలమంది భక్తులు చర్చించుకుంటున్నారు..ఈచర్చ ఎక్కడో కాదు నంద్యాల,ప్రకాశం జిల్లాలలోని కాశిరెడ్డి నాయన క్షేత్రాలలో జరుగుతున్నది..నాయన చనిపోయి 25 సంవత్సరాలు కావస్తున్నా ఆయన ఆశయాలను రెట్టించిన ఉత్సాహంతో ఒకరు అమలు చేస్తున్నారు..ఆయన పేరు చెప్పుకోవడానికి కాని పోటోలు ఇవ్వడానికి కాని అంగీకరించడు..ఈశ్వరుడు ఆదేశిస్తున్నాడు భక్తుడు అనుసరిస్తున్నాడు అనే నినాదంతో ఈ అన్న దాన సత్రాలు కొనసాగుతున్నాయి.. కనీస 10 ఏళ్లకు తక్కువ కాకుండా అన్నదానం చేస్తున్నారు.. .శ్రీ శ్రీ శ్రీ కాసిరెడ్డి నాయన పేరుతో నంద్యాల జిల్లా లోని నంద్యాల లోని గంగమ్మ ఆలయం లోనూ,బనగానపల్లి, శ్రీశైలం అసెంబ్లీ లోని ఓంకారం లోనూ వినుకొండ,కలుగొట్ల,సిద్దేశ్వరం తో పాటు మరికొన్ని ఆలయాల్లో ప్రతి రోజు మూడు పూటల ఎంతమంది భక్తులు వచ్చినా ఆందోళ చెందకుండా కనీసం ఐదు,ఆరు రకాలతో బోజనాలను వడ్డిస్తుంటారు..ఒక్కరోజు వడ్డించే రకాలు అధికంగానే ఉంటాయి..ఎనిమిది అన్న సత్రాలలో ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది..ఈమొత్తాన్ని కొంతమంది రైతులు, మరి కొంతమంది పేరు ప్రచారం చేసుకోవడానికి ఇష్ట పడని రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ద్వారా ఆర్ధిక సహాయం గానీ , వస్తూ రూపం లోగాని చేస్తుంటారు..అన్నదాన ఇన్చార్జి లు భక్తులకు ఎన్ని రకాలు పెడదాం అన్న వద్దు అనే మాట ఉండదని ఇన్చార్జి లు అంటుంటారు..అన్నదానం విజయవంతంగా జరుగడం లో చుట్టూ ప్రక్కల గ్రామాల రైతులు తమకు పండిన ప్రతి పంటలో దిగుబడి కొంత భాగాన్ని అన్నదాన సత్రాలకు తరలిస్తుంటారు..కుల మత ప్రసక్తి లేకుండా జరిగే అన్నదాన సత్రం ను నిర్వహిస్తూ ఉంటారు..ఏడాది కి శివ రాత్రి పండుగ కు నాలుగు ,ఐదు రోజులు,కార్తీక మాసం లో నాలుగు , ఐదు సోమవారాల్లో ఒక పౌర్ణిమ రోజు కలిపితే 8 సత్రాలలో ఒక లక్ష జనం అదనంగా వస్తారని వీరందరికీ కనీసము రు 3కోట్లు ఖర్చు అవుతుందని భక్తులు అంచనా వేస్తున్నారు.. ఇంత మంది భక్తులు కు అన్నదానం కల్పించడంలో కీలక పాత్ర వహిస్తున్న రిటైర్ బ్యాంక్ అధికారికి ప్రతి మనిషి అభినందనలు తెలుపుతున్నారు..శ్రీ కాశిరెడ్డి నాయన ఆయన ద్వారా అన్నదానం చేస్తున్నాడని భక్తులు అంటున్నారు..అంత ఈశ్వరేచ్చ అని అక్కడ సేవలు చేస్తున్న సేవకులు అంటున్నారు..