♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
⇒06 నుంచి 16 వ వార్షికోత్సవ వేడుకలు
⇒అందరికీ ఉచితంగా పూజలు, భోజనం, అల్పాహారం,వసతి
⇒సాంప్రదాయ దుస్తులే ఆలయంలోకి అర్హత
ప్రతి ఏడాది జగజ్జననీ దేవాలయంలో జరిగే వార్షిక ఉత్స వాలు 2025మార్చి 06వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ని నంద్యాల జిల్లా కేంద్రం లో ఈ ఆలయం ఉంది..ఈ దేవాలయాన్ని ప్రపంచం లోనే రెండో ఆలయం గా భక్తులు భావిస్తారు..అందుకే దేశం లోని అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు ఇక్కడి కి వచ్చి దర్శనాలు చేసుకుంటారు..అందుకే ఈ ఆలయాన్ని జాతీయ దేవాలయం అంటుంటారు..ఇక్కడ ప్రతి రోజు ఉదయం నుంచి 10 రకాల పూజలు రాత్రి వరకు జరుగుతాయి.అన్ని పూజల ను ఉచితంగానే భక్తులకు చేస్తారు..ఈపూజల లో పాల్గొనే భక్తులకు కనీసం 10 వేలు ఖర్చు ఆలయం నిర్వాహకులు భరిస్తుంటారు..ప్రతి భక్తుడికి ఉచితంగా టిఫిన్,భోజనం వసతిని కల్పిస్తారు…ఈ ఆలయం లో రోజు కు వంద మంది భక్తులకు ఉచితంగా అవకాశాన్ని బట్టి కొందరికి రవికలు, తవాళ్ళు,చీరలు,పంచలు ఇస్తారు.ఇది ఒకే ఒక గొప్పవిషయం..పలుకుబడి,పెట్టుబడి పెట్టే వారిని కూడా సాధారణ భక్తులుగానే చూస్తారు..అమ్మ వారి దర్శనం అందరికి ఆనందంగా అబ్బె విధంగా చూస్తారు..మార్చి 06 తేదీవ ఆరంభం అయి 07 తేదీ సహస్ర పాల అభిషేకం,08 తేదీ కుంకుమార్చన,09శ్రీ చక్రార్చన, 10న చండీ పూజ జరుగు తుందని ఆలయం నిర్వహకులు శివనాగ పుల్లయ్య,నారాయణ తదితరులు చెప్పారు..
07 వతేదీ నుంచి ఆలయం పచ్చదనం
—————–_____
వార్షిక ఉత్సవాలలో పచ్చదనం ఉట్టి పడుతుంది..07 వ తేదీ నుండిపండ్ల దండలతో,08వ తేదీ నుండి కూరగాయాల దండలతో, 09వ తేదీ పూల దండలతో అమ్మ వారు,ఆలయం లో ఉండే అన్ని దేవతలను అలంకరిస్తారు…అలంకారంలో టన్నుల కొద్దీ పండ్లు,కూరగాయలు, పూలు వాడుతారు..భక్తులు ఒకటి ,రెండు రోజులు ముందే వీటిని ఆలయానికి తీసుకొని వస్తారు..మొత్తం మీద నభూతో నభవిష్యత్ అన్న విదంగా జగ జ్జనని మాత ఆలయం వెలుగొందుతుంది..
వివరాలకు
9866727123
6303940212
9963364879
9502442210 సెల్ ఫోన్లు తో మాటలాడ వచ్చునని నిర్వహకులు పుల్లయ్య నారాయణ లు విలేకరులకు తెలిపారు..