జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
నంద్యాల జిల్లా కేంద్రం లోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళశాల నందు జాతీయ ఓటర్ల దినత్సవం సందర్బంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణ రెడ్డి ,డైరెక్టర్ జి.హేమంత్ , డి. ఎఫ్. ఒ.అనురాగ్ మీన,ప్రిన్సిపల్ సుబ్బయ్య , ఎన్.ఎస్.ఎస్.ఆఫీసర్స్ మరియు విద్యార్థులు హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి.రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ యువత యొక్క ఒక్కో ఓటు దేశానికి ఎంత ముఖ్యమన్నారు. . నేటి యువతలో మార్పు వస్తేనే రాజ్యాంగం సమర్ధవంతంగా అమలు అయ్యే రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుందన్నారు. . ఏ రాజకీయ నాయకుడికి అమ్ముడు పోకూడదని .ఓటుకు నోటు అనే పద్ధతిని మార్చడం వల్లే దేశం అభివృద్ది అవుతుందని చెప్పారు.ఒక ఓటు మన తర్వాత తరాల భవిషత్తు మీద కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు.నేటి ఎలక్షన్ సిస్టమ్ ఎలా ఉందో వివరించారు.నేటి రాజకీయ నాయకులు అసెంబ్లీ లో ఎన్నిక అవ్వడానికి వందల కోట్లు ఖర్చుపెట్టి దానిని పెట్టుబడిగా చూస్తూ ఎన్నికయ్యాక 5 ఏళ్లు తాను పెట్టుబడిపెట్టిన రూపాయికి మరో పదిరూపాయలు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారని ..దీనికి కారణం ఎన్నికల సమయంలో వారిచ్చే వెయ్యి రూపాయలకు ప్రజలు ఆశించడం అన్నారు..ఈవిదానానికి స్వస్వ పలికేలా యువత ప్రజల్లో మార్పు తీసుకురావలన్నారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డి. ఎఫ్. ఒ.అనురాగ్ మీన మాట్లాడుతూ. .గతంతో పోలిస్తే ఈసారి యువత ఓట్లనమోదు 70 శాతం అధికంగా ఉండటం యువకుల్లో పెరిగిన చైతన్యానికి, ఓటు హక్కు పట్ల ఆసక్తికి నిదర్శనంఅన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన యువత తమ ఓటు హక్కును సద్వినియోగంచేసుకోవాలని పిలుపు నిచ్చారు. సమ్మరీ 2024 లో భాగంగా ఎన్నికల అధికారులు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లకు వెళ్లి యువతను ఓటర్లుగా చేర్పించడంలో సక్సెస్ అయినట్లు, తద్వారా ఏపీలో అగ్రస్థానంలో నిలిచామన్నారు.
కార్యక్రమంలో ముఖ్య భాగంగా ముఖ్య అతిథుల సమక్షంలో నూతన ఓటర్లoదరితో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిదులను కళాశాల అధ్యక్షులు , సంచాలకులు, ఉపాధ్యాయుని – ఉపాధ్యాయులతో సన్మానించారు… ఈ కార్యక్రమానికి చివరగా జాతీయ గీతలాపన తో కార్యక్రమం ముగిసింది.