జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
కాంగ్రెస్‌పార్టీనుండి రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ, నియోజకవర్గాలకు పోటీ చేయాలంటే కేవలం దరఖాస్తు చేసుకోవడం మాత్రమే సరిపోదని దాని వెంట కొంత మొత్తాన్ని పార్టీకి చెల్లించాల్సి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీకి, పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తుల సమర్శించుకోవడానికి రెండు వారాల గడువు ఇచ్చింది. పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థికి జనరల్ సీట్కు అయితే 10 వేలు రిజర్వుడ్ సీట్ అయితే 5 వేలు డిపాజిట్ చేయాలి. డొనేషన్ ఫర్ దేశ్ అనే లింక్‌లో డిపాజిట్ చేయాలని పార్టీ ఆదేశించింది. మొత్తం మీద పది సంవత్సరాల నుంచి రెండు దఫాలుగా రాష్ట్రంలో భారీ ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడమే కష్టం అనుకోవడం తప్పేనని ఈ మొత్తాన్ని చెల్లించి దరఖాస్తు చేసుకోవడానికి చాల మంది ముందుకు వస్తున్నారని కాంగ్రెస్ నాయకులు జనాస్త్రంకు తెలిపారు.