జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
————-
24 గంటల్లో 500 పైగా సబ్స్క్రైబర్లు.. 3000 పైగా వీక్షణలు
————-
నంద్యాలకు చెందిన సీనియర్ జర్నలిస్టు , రచయిత..కాశీపురం ప్రభాకర్ రెడ్డి తన పేరుతోనే కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. కేవలం ఒక్క రోజు లోనే 500 సబ్స్క్రైబర్లు, 3000 వీక్షణలు సాధించి సంచలనం సృష్టించారు. గతంలో ఆయన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికల తో పాటు పలు వెబ్ మ్యాగజైన్ లకు ఫ్రీలాన్స్ జర్నలిస్టు గా పనిచేసి పలు అవార్డులు అందుకున్నారు.ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో క్రియా శీలకంగా ఉన్నారు. వివిధ సామాజిక అంశాలపై తనదైన శైలిలో..
ఆయన రాసే వ్యాసాలు ఆకట్టుకునేలా ఉంటాయి.ఆయన ఫేస్బుక్ అకౌంట్ కు వేలాది పాఠకులు, ఫాలోవర్లు ఉన్నారు. అలాగే Idream, Suman TV, UTV వంటి ఛానళ్ల కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లను లక్షలాది వీక్షకులు చూసారు. ఈ ఇంటర్వూ ల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి విదేశాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్నారు. రెండేళ్ల క్రితం కాశిపురం ప్రభాకర్ రెడ్డి రచించిన “మేడం..C” అనే నవల మూడు ముద్రణలు పూర్తి చేసుకుని టాప్ సెల్లింగ్ పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ నేపథ్యంలో కొందరి మిత్రుల ప్రోద్బలంతో తానే స్వయంగా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. తాను ఎందుకు ఈ చానల్ పెట్టాల్సి వచ్చిందో వివరిస్తూ 4 నిమిషాల తొలి వీడియో విడుదల చేశారు. ఆయన అప్పీల్ కు స్పందించి అపూర్వ స్పందన రావడం విశేషం. అలాగే రాయలసీమ అవసరాలు వివరిస్తూ..
సిద్దేశ్వరం ప్రాజెక్టు పై ఆయన చేసిన రెండో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆయనను అభినందిస్తూ కామెంట్స్ పెట్టారు.
సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ పై చేసినమొట్ట మొదటి విడియో వేలాది రాయలసీమ వాసుల హృదయాలు చూరగొంది.తీగెల వంతెన కావాలా బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కావాలా అంటూ చేసిన ఒక షార్ట్ రీల్ నెట్టింట హల్చల్ చేస్తూ..అందరిలో ఆలోచనలు రేకెత్తిస్తోంది.అండమాన్ దీవిలో కనుగొన్న చమురు నిక్షేపాలు దేశానికి గేమ్ చేంజర్ కానుందని, అలాగే నిత్య జీవితంలో యోగా ప్రాధాన్యత ను వివరిస్తూ చందా పాములేటి జీవితం గురించి ఉదహరిస్తూఆయన ప్రసారం చేసిన వీడియోలను వేల సంఖ్యలో వీక్షించారు.సామాజిక బాధ్యతతో కూడిన వ్యాసాలు రాసే కాశీపురం ప్రభాకర్ రెడ్డి తన వీడియోల ద్వారా లక్షలాది వీక్షకుల మన్ననలు పొందాలని ఆశిద్దాం.
…. మారంరెడ్డి జనార్దన్ రెడ్డి,
జనాస్త్రం ప్రతినిధి