జనాస్త్రo ప్రతినిధి మారంరెడ్డి జనార్ధన రెడ్డి
* 54 నెలలు నుంచి దాదాపు 60 వేల మందికి ఉచిత టెస్టింగ్ లు
* ప్రతినెల కనీసం రూ2 లక్షలు ఖర్చు
* రోగులకు రూ 5 లక్షల వైద్యం అందజేత
* ఉచిత అన్నదానము కూడా
* ఇంతవరకు కోటి కి పైగానే ఖర్చు
* సూర్య ,చంద్రులు ఉన్నంత వరకు ఉచిత క్యాంప్ లు జరుగుతాయి.
*విద్యరంగం లో వచ్చిన ఆదాయం కొంత పేద రోగుల ఆరోగ్యం కోసం
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నంద్యాల జిల్లా కేంద్రం లోని గురురాజా బ్యాంక్ కోచింగ్ సెంటర్ చెర్మైన్ పి.దస్తగిరి రెడ్డి నెలకు కనీసం రూ 2 లక్షలు ఖర్చు చేసి సంజామల మండలం లోని మంగం పల్లె గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్ ను జరుపుతున్నారు.మంగంపల్లి గ్రామం దస్తగిరి రెడ్డి సొంత గ్రామము తనకు జన్మను ఇవ్వడమే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని,అందువల్ల వారికి ఉచిత వైద్య సేవలను అందించాలని 54 నెల్ల క్రితం కోట్లు విలువ చేసే భవనాలను నిర్మించారు.వరదలు వచ్చినా ఉచిత మెడికల్ క్యాంప్ కొనసాగాలని పక్క భవనాలను నిర్మించారు.ఇక్కడ ప్రతి నెల ఉచిత మెడికల్ క్యాంప్ ద్వారా కనీసం 1000 నుంచి 1500 మందికి ఉచితంగా పరీక్షలను చేసి కనీసం రు 2 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది.ఈ క్యాంప్ లో సమర్థవంతమైన డాక్టర్ లు 10 నుంచి 15 మంది వరుకు పాల్గొంటున్నారు.ఇందులో మహిళా రోగులకోసం మహిళా డాక్టర్ లు కూడా హాజరు అవుతున్నారు..ప్రతి రోగికి రోగం తీవ్రతను బట్టి నెల రోజులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు.రోగితో పాటు ఆయన వెంట వచ్చిన వారికి ఉచిత భోజన వసతిని కల్పిస్తున్నారు.ఇదంతా నంద్యాల పట్టణంలో భారీగా విజయవంతంగా నడుస్తున్న గురురాజా విద్య సంస్థల అధినేత షేక్షావలి రెడ్డి (దస్తగిరి రెడ్డి కుమారుడు)చూస్తున్నారు. ఒక్కొక్క క్యాంప్ కు హాజరు అయిన రోగులు ప్రవైట్ ఆసుపత్రులకు వెళితే రు 5 లక్షల నుంచి రూ 8లక్షలు ఖర్చు అవుతుందని,ఇంత మొత్తం రోగులకు దస్తగిరి రెడ్డి మిగిలిస్తున్నారని అక్కడి కి వచ్చిన Dr శివయ్య తో పాటు మరి కొందరు డాక్టర్ లు జనాస్త్రం తో అన్నారు..ఒకనెల కాదు,రెండు నెలలు కాదు ఏకంగా 54 నెలలు నుంచి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి క్యాంప్ లు జరుపడం దస్తగిరి రెడ్డికి సాధ్యం అయిందని కూడా Dr శివయ్య జనాస్త్రంతో అన్నారు.సూర్య చంద్రులు ఉన్నంత వరకు దస్తగిరి రెడ్డి కుటుంబికులు,వారసులు జరిపి తీరుతామని మెడికల్ క్యాంప్ ఇంచెర్జ్ షేక్ షా వలి రెడ్డి అన్నారు.